తాలిబన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్. ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ వ్యతిరేక ఉగ్రవాదులకు అడ్డాగా మార్చవద్దని హెచ్చరించింది. ఖతార్ రాజధాని దోహలో తాలిబన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు భారత రాయబారి దీపక్ మిట్టల్. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని కోరారు. అంతేకాదు ఆఫ్గన్ నుంచి భారతీయుల తరలింపును కూడా అడ్డుకోవద్దని సూచించారు. తాలిబన్లతో అధికార హోదాలో భారత్ చర్చలు జరపడం ఇదే తొలిసారి.
తాలిబన్ నాయకులతో భారత్ రాయబారి దీపక్ మిట్టల్ మంగళవారం సమావేశం అయ్యారు. ఖతార్‌లోని తాలిబాన్ రాజకీయ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ మావేశంలో ఆ దేశ నాయకుడు షేర్ మహ్మద్ అబ్బాస్‌ను భారత రాయబారి దీపక్ మిట్టల్ కలిశారు.
అయితే గత కొద్ది రోజులుగా తాలిబన్ నాయకులు భారత్‌ను కోరుతున్నారు. ఈ మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రతతోపాటు అక్కడే చిక్కుకున్నవారు తిరిగి రావడంపై చర్చలు జరిగాయి.
ఇదిలావుంటే.. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరైనా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవాల్సి వస్తే అది పాకిస్థాన్ మాత్రమే. తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల మద్దతు మూటగట్టడానికి.. ప్రత్యేకించి ఇస్లామిక్ దేశాలన్నిటినీ తాలిబన్లకు దగ్గర చేయడానికి చర్యలు ప్రారంభించింది పాకిస్తాన్. ఇందులో భాగంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి అనేక దేశాలకు ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలకు వెళ్లారు.
ఒక నివేదిక ప్రకారం, తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించాలని, దీని ద్వారా ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ బలంగా కోరుకుంటోంది. మరోవైపు, భారతదేశంతో సహా చాలా దేశాలు ‘చూడండి..వేచి ఉండండి’ విధానాన్ని అనుసరిస్తున్నారనేది కూడా నిజం. ఆగస్టు 31 తర్వాత, చిత్రాన్ని దౌత్య స్థాయిలో క్లియర్ చేయడం ప్రారంభించవచ్చు. అప్పటికి విదేశీ సైనికులు.. పౌరులందరూ ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వెళ్ళిపోవడం పూర్తవుతుందని భావన.
ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్