Teachers Salaries: నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..!

|

Oct 22, 2021 | 11:33 AM

Teachers Salaries: తమ జీవన విధానంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవర్ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని..

Teachers Salaries: నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..!
Follow us on

Teachers Salaries: తమ జీవన విధానంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవర్ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆప్ఘనిస్థాన్‌ని హెరాత్‌లో వందలాది ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. తమకు భారీగా జీతాలు ఏమీ లేవని, వేతనాలు చెల్లించకపోవడంతో పూటగడవడం కష్టంగా మారిందని, వెంటనే చెల్లించాలని తాలిబన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

హెరాత్‌ ప్రావిన్స్‌లో 10 వేల మంది మహిళా టీచర్లు సహా సుమారు 18000 మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడంలేదు. దీంతో కరెంటు బిల్లు కట్టడానికి తమ వద్ద డబ్బులు లేవని, చాలా మంది ఇంట్లో కరెంటు కట్‌ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమన్‌గన్‌, నూరిస్థాన్‌ ప్రావిన్స్‌లలో గత వారం వందలాది మంది డాక్టర్లు తమకు జీతాలు చెల్లించాలని ఆఫ్ఘనిస్థాన్‌ లోని యునైటెడ్‌ నేషన్స్‌ అసిస్టెన్స్‌ మిషన్‌ గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. అయితే తమకు గత 14 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు నెలలో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో దేశంలో ఆర్థికంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లలకు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. చికిత్స చేయించేందుకు డబ్బులు లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వారు చెబుతున్నారు. అయితే మరికొన్ని నెలల్లో ఒకనెల జీతం చెల్లించనున్నట్లు ప్రావిన్షియల్‌ ఎడ్యుకేషన్‌ హెడ్‌ షుహాబుద్దీన్‌ తెలిపినట్లు టోలో న్యూస్‌ నివేదింది. తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి బ్యాంకులు మూసివేయబడ్డాయి. కొందరి ఖాతాలో డబ్బులు ఉన్న ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి:

UAE Golden Visa: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న లెజెండరీ సింగర్ చిత్ర.. ఫోటో సోషల్ మీడియాలో షేర్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలిక సహా 8 మంది దుర్మరణం.. ఘటన స్థలానికి పోలీసులు..!