తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ నుంచి ఇండియాకు ఉగ్రవాద ముప్పునకు అవకాశాలు ఉన్నాయని అనుమానం వచ్చిన వెంటనే దాన్ని ఇండియా తీవ్రంగా ఎదుర్కొంటుందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఉగ్రవాదంపై జరిగే పోరులో క్వాడ్ లో సభ్యత్వం ఉన్న దేశాలు తమ సహకారాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకుంటారని ఇండియా ముందే ఊహించిందని..కానీ తాజా పరిణామాలు.. జరిగిన సమయం చూస్తే ఆశ్చర్యంగా ఉందని ఆయన చెప్పారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన సమావేశంలో..ఆయన ..యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ అడ్మిరల్ జాన్ అక్విలినితో కలిసి పాల్గొన్నారు. ఆఫ్ఘానిస్తాన్ కు సంబంధించినంత వరకు ఆ దేశం నుంచి భారత్ లోకి ఎలాంటి ఉగ్రవాద దాడి అవకాశాలు తలెత్తినా సహించే ప్రసక్తి లేదని ..దీటుగా ఎదుర్కోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. 20 ఏళ్ళు గడిచినా తాలిబన్లు మారలేదన్నారు. నాడు వారి వైఖరి ఎలా ఉందొ.. ఇప్పుడు కూడా అలాగే ఉందని, కానీ ‘పార్ట్ నర్లు ‘ మాత్రం మారారని ఆయన చెప్పారు. వారి ఆగడాల గురించి అనేకమంది చెబుతుంటే విన్నానన్నారు.
క్వాడ్ లో ఇండియాతో బాటు అమెరికా,జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ దేశాలు టెర్రరిజం పై పోరును మరింత ఉధృతం చేయాల్సి ఉందని జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఇదివరకు కన్నా ఇప్పుడు మరింత సహకరించుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. ఇలా ఉండగా తాలిబన్లు తాము ఇదివరకటి కన్నా శక్తిమంతంగా ఉన్నట్టు తమ డ్రెస్,, ఆయుధాలతో కూడిన కొత్త వీడియోలను రిలీజ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రైవేటీకరణతోనే ఇండియా ముందుకెళ్తుందా.? Big News Big Debate Live Video.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల…: TS EAMCET Result 2021 Live Video.
కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.