అఫ్ఘానిస్తాన్ లో ఉన్న తమ దేశస్థులందరి తరలింపు పూర్తి అయ్యేంతవరకు అక్కడే తమ బలగాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఒక్క అమెరికన్ ని కూడా అక్కడ ఉండనివ్వబోమని, అంటే తాలిబన్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా తాము దాదాపు పక్కన పెట్టినట్టేనని ఆయన చెప్పారు. కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం మొదటిసారిగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇస్తూ.. అక్కడ గందరగోళ పరిస్థితులను నివారించజాలమన్నారు., కాబూల్ నుంచి అమెరికా బలగాల తరలింపునకు ఈ నెల 31 డెడ్ లైన్ గా అమెరికా ఇదివరకే ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది గనుక.. అమెరికన్ల తరలింపు పూర్తి అయ్యేంతవరకు..ఎంతకాలమైనా తమ సైనికులు అక్కడే ఉంటారని బైడెన్ స్పష్టం చేశారు. అయితే ఈ పొడిగింపు ఎలా జరుగుతుందన్న దానిపై ఆయన వివరించలేదు. కాబూల్ విమానాశ్రయం అమెరికన్ సేనల అధీనంలో ఉన్నప్పటికీ నగరంలోని అనేక ప్రాంతాలు తాలిబన్ల స్వాధీనంలో ఉన్నాయి. ప్రజల తరలింపులో యూఎస్ బలగాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయన్న అంశంపై స్పందించిన బైడెన్.. తరలింపు ప్రక్రియ అంత సులభం కాదన్నారు.
ఎలాంటి ఉద్రిక్తత లేకుండా ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో తనకు అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. తాలిబన్లు తమ దేశ బలగాలకు సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థలు పరిస్థితిని అంచనా వేయడంలో విఫలం చెందాయన్న విమర్శను ఆయన తోసిపుచ్చారు. ఇదేమంత పెద్ద విషయం కాదన్నారు. కాబూల్ విమానాశ్రయంలో ప్రజలు విమానాల రెక్కలపైనా,, ఇంజను పైనా ఎక్కిన అంశంపై అడిగిన [ప్రశ్నకు ఆయన.. ఇది దురదృష్జకోరామన్నారు.