Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేమంటూ దేశ ప్రజలు భయంతో హడిలిపోతున్నారు. అవకాశం ఉంటే దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలతో నిండిపోయింది. తమను కాపాడండి అంటూ విదేశీ సిబ్బందిని వేడుకుంటున్నారు. తమను కాకపోయినా.. తమ పిల్లలను అయినా తీసుకెళ్లండి అంటూ ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి బాధాకరమైన ఘటనలు కాబుల్ ఎయిర్ పోర్టులో దర్శనమిస్తున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టులో పరిస్థితిని గమనిస్తే.. తాలిబన్లు అంటే ఏ రేంజ్‌లో వణుకు ఉంటుందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.
కాబూల్ ఎయిర్‌పోర్ట్ గోడకు అటువైపు బ్రిటన్, అమెరికా సహా ఇతర దేశాల సిబ్బంది, సైన్యం ఉన్నారు. ఇటువైపు ఆఫ్గన్ మహిళలు, ప్రజలు ఉన్నారు. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేమని, తమను రక్షించాలని విదేశీ సైన్యాన్ని వారు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాలిబన్ల పాలనలో ఆడపిల్లలకు రక్షణ ఉండదని, చిన్న పిల్లలను తమ వెంటనే తీసుకెళ్లిపోవాలంటూ ఆఫ్గన్ మహిళలు ఇతర దేశాల సైన్యాన్ని వేడుకుంటున్నారు. ఏడాది నుంచి పదేళ్ల లోపు వయసున్న ఆడపిల్లల్ని ఎయిర్ పోర్ట్ గోడ దగ్గరకు తీసుకువచ్చి సైన్యాన్ని ప్రాథేయ పడుతున్నారు. ‘‘అయ్యా.. మేం తాలిబన్ల చెరలో ఉన్నాం. మాకు బతుకులేదు. మా పిల్లలు మాతో ఉంటే వారికి కూడా చావు తప్పదు. లేదంటే మానం, ఆత్మాభిమానం చంపుకుని బతకాలి. కాదని ఎదిరిస్తే వారి చేతుల్లో చావాలి. దయచేసి తీసుకెళ్లిపోండి.’’ అంటూ ఈ వైరల్ వీడియోల్లో వేడుకుంటున్నారు. ఇక, తాలిబన్ల చేతికి దేశం వెళ్లాక తమ పరిస్థితి మరింత దీనంగా ఉంటుందని కన్నీరు మున్నీరవుతున్నారు అక్కడి ప్రజలు. తమకు రక్షణ కల్పించాలని, లేదా దేశం దాటించాలని అమెరికన్ సైన్యాన్ని ఆఫ్గన్ యువతులు వేడుకుంటున్నారు.
Video:
?| #Afghans giving up their babies to save them
▪️Afghans at the gates of #Kabul airport were seen passing their kids and babies through the fences towards unknown places to escape #Afghanistan. pic.twitter.com/mpHBgC7fzn
— EHA News (@eha_news) August 19, 2021
Also read:
TDP: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత.. కారణమదేనా..?