Blackhawk: వామ్మో.. రంగంలోకి తాలిబన్‌ పైలట్స్. హెలికాప్టర్‌ను ఎలా టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తున్నారో చూశారా.?

Blackhawk Helicopter: ఏమంటూ అమెరికా దళాలు ఆఘ్గనిస్థాన్‌ను విడిచి వెళ్లాయో తాలిబన్ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఆఘ్గాన్‌ నగరాలు ఒక్కొక్కటి తాలిబన్ల వశం అవుతున్నా కొద్దీ..

Blackhawk: వామ్మో.. రంగంలోకి తాలిబన్‌ పైలట్స్. హెలికాప్టర్‌ను ఎలా టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తున్నారో చూశారా.?
Talibans

Updated on: Aug 27, 2021 | 12:51 PM

Blackhawk Helicopter: ఏమంటూ అమెరికా దళాలు ఆఘ్గనిస్థాన్‌ను విడిచి వెళ్లాయో తాలిబన్ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఆఘ్గాన్‌ నగరాలు ఒక్కొక్కటి తాలిబన్ల వశం అవుతున్నా కొద్దీ.. తాలిబన్లు సంబురాలు చేసుకున్నారు. చిన్న పిల్లల్లా మారి కేరింతలు కొట్టారు. ఆ సమయంలో చిన్న పిల్లలు ఆడే గుర్రం ఆట, కార్లపై ఆడుతూ సందడి చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాలిబన్లు పైశాచిక ఆనందం చూడండి అంటూ ప్రపంచమంతా ఒకింత భయపడినా, మరోవైపు నవ్వుకున్నారు. ఇక తాలిబన్ల ఆక్రమణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలోని ఎయిర్‌ పోర్ట్‌లను ఆధీనంలోకి తీసుకుంటున్న తాలిబన్లు..

తాజాగా బ్లాక్‌హాక్‌ అనే హెలికాప్టర్‌ను తమ వశం చేసుకున్నారు. అమెరికా ఆర్మీకి చెందిన ఈ హెలికాప్టర్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ హెలికాప్టర్‌లలో ఈ బ్లాక్‌హాక్‌ ఒకటి. అమెరికా ఆర్మీ పోతూపోతూ వదిలేసి వెళ్లి పోయిన ఈ హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు దానిని నడిపించే ప్రయత్నం చేశారు. అయితే సాధారణ హెలికాప్టర్‌లకు భిన్నంగా ఉండే ఈ బ్లాక్‌హాక్‌ను టేకాఫ్‌ చేయడం తాలిబన్లకు వీలు కాలేదు. దీంతో హెలికాప్టర్‌ అక్కడక్కడే చక్కర్లు కొట్టింది కానీ.. గాల్లోకి మాత్రం ఎగరలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన తాలిబన్ల హెలికాప్టర్‌ టెస్ట్‌ డ్రైవింగ్‌ వీడియోను మీరూ చూసేయండి మరి.

ఇదిలా ఉంటే ఆఘ్గనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం కనపిస్తోంది. ఆత్మాహుతి దళాలు కొన్ని ఎయిర్ పోర్టును పేల్చేసే ప్రణాళికలు రచిస్తున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర గుమికూడిన తమ దేశ పౌరులందరినీ వెనక్కు వెళ్లిపోమని, సురక్షిత ప్రాంతాల్లో వేచి ఉండాల్సిందిగా సూచించాయి. అయితే ఆప్ఘన్ పౌరులు మాత్రం ఈ హెచ్చరికలను లెక్క చేయడం లేదు.

Also Read: Headache: తలనొప్పి భరించలేకపోతున్నారా..! అయితే ఈ 5 హోం రెమిడిస్ తక్షణ ఉపశమనం..

Viral Video: మీరెప్పుడైనా ఇలాంటి బైక్‌ నడిపారా..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

RGV Dance: వైరల్‌ అవుతోన్న సుల్తానా, రాంగోపాల్‌ వర్మ మరో డ్యాన్స్‌ వీడియో.. ఇంతకీ సుల్తానా ఎవరో తెలుసా?