United States: అరుదైన ఘటన.. గర్భిణి అని తెలుసుకున్న 48 గంటల్లో డెలివరీ.. ట్విస్ట్ ఏంటంటే..
మహిళలు గర్భం దాల్చే సమయంలో వారి శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పుల కారణంగా వారు ప్రెగ్నె్న్సీతో ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వైద్యులను సంప్రదించి, పలు పరీక్షలు చేయించి..

మహిళలు గర్భం దాల్చే సమయంలో వారి శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పుల కారణంగా వారు ప్రెగ్నె్న్సీతో ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వైద్యులను సంప్రదించి, పలు పరీక్షలు చేయించి నిర్ధారించుకుంటారు. తొమ్మిది నెలలు గర్భంలో శిశువును మోసిన తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. అంతకంటే ఒక్క నెల ముందు బిడ్డను కన్నా ఆ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే తల్లి గర్భంలో శిశువు సంపూర్ణ అభివృద్ధి చెందడానికి కచ్చితంగా తొమ్మిది నెలల సమయం కావాల్సిందే. కానీ ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తాను గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. నిజంగా ఇది నమ్మలేని నిజం. అమెరికాకు చెందిన 23 ఏండ్ల పేటన్ స్టోవర్ స్థానిక విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు తల తిరిగినట్లుగా, వికారంగా అనిపించడంతో పని ఒత్తిడివల్ల కావచ్చని లైట్ తీసుకుంది. కానీ, క్రమంగా బాడీలో మార్పులు రావడం, కాళ్లలో వాపు రావడంతో దాంతో భయపడిన ఆమె వైద్యులను సంప్రదించింది.
మహిళను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు ప్రెగ్నెన్సీ అని నిర్ధారించారు. కానీ, స్టోవర్ నమ్మలేదు. దాంతో అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకుంది. కడుపులో బిడ్డ ఉన్నట్లు స్కానింగ్‌లో క్లియర్‌గా కనిపించడంతో తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు నమ్మింది. పైగా గర్భం వచ్చి ఆరు నెలలు దాటిందని వైద్యులు చెప్పడంతో దంపతులిద్దరూ షాకయ్యారు. అంతేగాక, ప్రెగ్నెన్సీతో పాటు అత్యంత అరుదుగా వచ్చే ప్రీక్లామ్‌ప్సియా అనే రుగ్మత స్టోవర్‌లో ఉందని, దీనివల్ల బీపీ ఎక్కువై కిడ్నీలు, కాలేయం పనితీరు మందగిస్తుందని, ఇది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో స్టోవర్ దంపతులు భయంతో వణికిపోయారు.
వైద్యుల సూచన మేరకు వెంటనే ఆస్పత్రిలో చేరగా.. 48 గంటల్లో సర్జరీ చేసి తల్లీబిడ్డ ఇద్దరినీ కాపాడారు. ఆమెకు ఒక కిలో 800 గ్రాముల బరువుతో మగబిడ్డ జన్మించాడు. కాగా, ఆరు నెలల గర్భిణి అయినా స్టోవర్ పొట్ట లావుగా బయటికి కనిపించకపోవడానికి ప్రీక్లామ్‌ప్సియా కారణం అయివుండవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటివి అత్యంత అరుదుగా సంభవిస్తాయని తెలిపారు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి