ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై మొత్తం ఎనిమిది మంది మాజీ భారతీయ నావికులకు డిసెంబర్ 28న మరణశిక్షపై స్టే విధించారు. ఈ విషయమై ఖతార్‌లోని కోర్టును ఆశ్రయించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు శిక్షను తగ్గించింది.
దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ సవివరమైన నిర్ణయం కాపీ కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. తదుపరి చర్యలకు సంబంధించి ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలతో న్యాయ బృందం సంప్రదింపులు జరుపుతోంది. విచారణ సందర్భంగా రాయబారులు, అధికారులు కోర్టుకు హాజరయ్యారు. మొదటి నుండి ఎనిమిది మంది కుటుంబానికి అండగా నిలుస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
"We have noted the verdict today of the Court of Appeal of Qatar in the Dahra Global case, in which the sentences have been reduced…The detailed judgement is awaited….Our Ambassador to Qatar and other officials were present in the Court of Appeal today, along with the family… pic.twitter.com/ysjVhbisaK
— ANI (@ANI) December 28, 2023
ఖతార్ పోలీసులు అరెస్టు చేసిన 8 మంది మాజీ మెరైన్‌లలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత కమాండర్ పూర్ణాందు తివారీ కూడా ఉన్నారు. ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందిని కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ గోపకుమార్‌లుగా గుర్తించారు. వీరంతా ఖతార్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఖతారీ ఎమిరి నేవీకి శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ ఖమీస్ అల్ అజ్మీ ఈ కంపెనీకి సీఈఓగా ఉన్నారు.
ఖతార్‌లో అరెస్టయిన 8 మంది మాజీ నేవీ అధికారుల మరణశిక్షను నిలిపివేశారు. గతేడాది ఖతార్‌లో అరెస్టయిన 8 మంది మాజీ భారత నావికాదళ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖతార్‌లోని అల్ దహ్రా కంపెనీలో పనిచేస్తున్న భారత నావికాదళానికి చెందిన ఈ ఎనిమిది మంది మాజీ అధికారులు గతేడాది ఆగస్టు నుంచి ఖతార్‌లో జైల్లో ఉన్నారు. ఈ మాజీ అధికారులందరిపై వచ్చిన ఆరోపణల గురించి ఖతార్ ఇంకా సమాచారం ఇవ్వలేదు. అయితే వీరంతా గూఢచర్యానికి పాల్పడ్డారని ఈ కేసుకు సంబంధించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఖతార్ అధికారికంగా నిరూపించలేకపోయింది.
ఈ నేపథ్యంలోనే దహ్రా గ్లోబల్ కేసులో అరెస్టయిన మాజీ నేవీ అధికారికి శిక్షలు తగ్గిస్తూ, ఖతార్ అప్పీల్ కోర్టు వివరణాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..