Canada: ఇలాంటి కష్టం ఏ తల్లికీ రాకూడదు.. కన్నబిడ్డ అని గుర్తించలేక.. చివరకు కడుపుకోతే మిగిలింది..

|

Nov 25, 2022 | 6:13 AM

కడుపున పుట్టిన కుమార్తెను కంటికి రెప్పలా కాచుకుంది. ఆమె లా చదువుతానని కోరుకుంటే అందుకు తగ్గట్టే అంగీకరించింది. కూతురు వేసే ప్రతి అడుగులోనూ వెన్నంటి ఉండి ప్రోత్సహించింది. కానీ తానొకటి తలిస్తే.. విధి...

Canada: ఇలాంటి కష్టం ఏ తల్లికీ రాకూడదు.. కన్నబిడ్డ అని గుర్తించలేక.. చివరకు కడుపుకోతే మిగిలింది..
Canada Mother
Follow us on

కడుపున పుట్టిన కుమార్తెను కంటికి రెప్పలా కాచుకుంది. ఆమె లా చదువుతానని కోరుకుంటే అందుకు తగ్గట్టే అంగీకరించింది. కూతురు వేసే ప్రతి అడుగులోనూ వెన్నంటి ఉండి ప్రోత్సహించింది. కానీ తానొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచిందని తెలుసుకుని దుఖంలో మునిగిపోయింది. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ యువతిని కాపాడిన ఆ మహిళ.. ఆమెకు సపర్యలు చేసి, ఆస్పత్రిలో జాయిన్ చేసింది. పని పూర్తయ్యేంత వరకు ఆమె వెంటే ఉంది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న ఆమెకు పోలీసుల నుంచి ఓ ఫోన్‌ వచ్చింది. మీ కుమార్తె ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలుసుకుని షాక్ అయింది. అంతలోనే ఆమెకు మరో ఊహించని షాక్‌ తగిలింది. ఆస్పత్రిలో జాయిన్ చేయించి, కాపాడిన యువతే తన కుమార్తె అని తెలుసుకుని కన్నీరుమున్నీరైంది. కెనడా దేశానికి చెందిన జేమీ ఎరిక్సన్‌ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. నవంబరు 15 న ఆమె అల్బర్టా రోడ్డులో వెళ్తున్నారు. ఆమె వెళ్తున్న సమయంలో ఓ కారు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఆమె.. బాధితురాలిని దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించింది. యువతికి తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఈ సమయంలో విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఎరిక్సన్‌కు షాకింగ్ వార్త తెలిసింది. తన కుమార్తె మోంటానా రోడ్డు ప్రమాదంలో చనిపోయిందన్న వార్త విని షాక్ అయింది. అప్పటికే తీవ్ర బాధలో కూరుకుపోయిన ఆమె.. పూర్తి వివరాలు తెలిసుకుని మరింత దుఖంలో మునిగిపోయింది. ఇంతకు ముందు తాను ఆస్పత్రిలో చేర్పించిన యువతే తన కుమార్తే అని తెలుసుకునేసరికి ఆమె కన్నీటిపర్యంతమైంది.

మృతి చెందిన యువతి మోంటానా.. టాలెంటెడ్‌ స్విమ్మర్‌. అంతే కాకుండా ఆమె న్యాయశాస్త్రం చదవాలని కోరుకున్నట్లు తల్లి ఎరిక్సన్ గుర్తు చేసుకుని విలపించిన తీరు తీవ్ర విషాదానికి గురి చేసింది. అంత బాధలోనూ ఆమె కుమార్తె అవయవ దానానికి అంగీకరించారు. తన కుమార్తె ఇతరులకు ప్రాణం పోస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె దుఖంతో పూడుకుపోయిన గొంతుతో చెప్పడం.. కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం