ఖరీదైన ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న శునకం.. ప్రత్యేక చాంబర్.. సకల సదుపాయాలు.. వింతగా ఉన్నా ఇది నిజం..

|

Dec 06, 2020 | 10:14 PM

కరోనా రోజు రోజుకు ఎంతో మందిని కబళిస్తోంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్ని ఎదురుచూస్తున్నాయి. ఈ సమయంలో

ఖరీదైన ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న శునకం..  ప్రత్యేక చాంబర్.. సకల సదుపాయాలు.. వింతగా ఉన్నా ఇది నిజం..
Follow us on

కరోనా రోజు రోజుకు ఎంతో మందిని కబళిస్తోంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్ని ఎదురుచూస్తున్నాయి. ఈ సమయంలో కరోనా వారియర్స్ ప్రాణాలను పనంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. ముఖ్యంగా వైద్యరంగంలో పని చేసేవారు ఎంతో ఒత్తిడిని భరిస్తూ కరోనా పేషెంట్లకు సాయం చేస్తున్నారు. అయితే వీరి మానసిక ప్రశాంతత కోసం అమెరికాలోని ఓ ఆస్పత్రి యాజమాన్యం ఓ శునకానికి వాలంటీర్‌గా ఉద్యోగం ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శునకమేంటి, ఉద్యోగమేంటని అనుకుంటున్నారా అయితే చదవండి..

ఓహోయో రాష్ట్రంలోని స్టేట్ యూనివర్సిటీకి చెందిన వెక్స్‌నర్ మెడికల్ సెంటర్‌ యాజమాన్యం ఓ శునకాన్ని ఉద్యోగంలో నియమించుకుంది. దీని పని ఏంటంటే ఆస్పత్రి మొత్తం తిరుగుతూ.. కనిపించిన వారి దగ్గరికి వెళ్లి వారి మొహంలో మొహం పెట్టి చూడటమే. ఈ ఆస్పత్రి కాన్సెప్ట్ ఏంటంటే మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నవారు కొంత సమయం పెంపుడు జంతువులతో గడిపితే కొంత ఉల్లాసంగా గడుపుతారని ఉద్దేశ్యం. దీంతో షిలో అనే శునకాన్ని వలంటీర్‌‌గా నియమించుకొని అందరికి మానసిక ప్రశాంతను అందిస్తోంది ఈ ఆస్పత్రి యాజమాన్యం. అయితే ఇప్పుడు ఈ శునకం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.