వీపుపై మొసలిని మోసుకెళ్లిన బాలుడు.. వీడియో వైరల్

|

Mar 20, 2023 | 4:57 PM

మొసలిని చూస్తేనే కొంతమంది భయంతో హడలెత్తిపోతారు. దాని దగ్గరకు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు.

వీపుపై మొసలిని మోసుకెళ్లిన బాలుడు.. వీడియో వైరల్
Boy Carrying A Crocodile
Follow us on

మొసలిని చూస్తేనే కొంతమంది భయంతో హడలెత్తిపోతారు. దాని దగ్గరకు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు. అయితే ఓ బాలుడు మాత్రం ఎలాంటి భయం, బెదురు లేకుండా ఓ మొసలి పిల్లని తన వీపుపై మోసుకుంటూ దర్జాగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా సోషల్ మీడియాలో పిల్లల చేసే సరదా చేష్టలు ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రత్యేకంగా జంతువులతో వారు చేసే ఆటలు సరదాలు వినోదం కలిగిస్తాయి. కాని ఆ బాలుడు ఆ మొసలి ముందు కాళ్లను తన చేతులతో పట్టుకుని వీపుపై మోసుకెళ్లిన ఘటన అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ బాలుడు, మొసలి మధ్య నిజమైన స్నేహం ఉందని ఒకరు కామెంట్ చేశారు. అయితే నదులు, సముద్ర తీరాల్లో నివసించే మత్స్యకార కుటుంబానికి ఆ బాలుడు చెంది ఉంటాడని మరొకరు తెలిపారు. చిన్నప్పటి నుంచి మొసలి వంటి జీవుల ప్రవర్తన, వాటి మనసత్త్వం గురించి అతడికి బాగా తెలిసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.మరోవైపు బాలుడు తన వీపుపై మోసుకెళ్లింది చచ్చిన మొసలి అని, దానిని వండుకుని తినేందుకు తీసుకెళ్లాడని మరొకరు కామెంట్‌ చేశారు. వీడియోలోని ప్రదేశం ఫ్లోరిడా తీర ప్రాంతం కావచ్చని ఒకరు తెలిపారు. ఒకవేళ బాలుడు కాకుండా మరో వ్యక్తి అలా చేసి ఉంటే ఈ పాటికి ఆ మొసలి దాడి చేసి ఉండేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం