చాలామంది అందం అంటే టీనేజ్ లో ఉన్నప్పటిదే అని అనుకుంటారు. అందుకే కొంతమంది పెద్దవారిని చూసి నచ్చితే వెంటనే ఈ వయసులోనే ఇంత అందంగా ఉంది.. అదే వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నదో .. ఎంత మంది కుర్రకారు మతులు పోగొట్టిందో అని ఆలోచిస్తూ ఉంటారు కూడా.. అయితే 60 ఏళ్ల ఓ బామ్మ అందం మీద ఉన్న అభిప్రాయాన్ని మారుస్తూ ఇపుడు అందాల సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న లా ప్లాటా నగరానికి చెందిన న్యాయవాది, పాత్రికేయురాలు 60 ఏళ్ల అలెజాండ్రా టైటిల్ ను సొంతం చేసుకుంది. అందం అంటే ఉన్న మూస ఆలోచనలకు చెక్ పెట్టి అందాల సుందరి కిరీటం దక్కించుకోవాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించింది.
అసోసియేటెడ్ ప్రెస్ నివేదించిన ప్రకారం అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్ విజయం ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. అంతేకాదు ఇంత లేటు వయసులో ప్రతిష్టాత్మక అందాల పోటీని గెలుచుకున్న మొదటి మహిళగా రికార్డ్ సృష్టించింది. వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్టు అయిన అలెజాండ్రా ప్రకాశవంతమైన చిరునవ్వు, మనోహరమైన ప్రవర్తన న్యాయనిర్ణేతల, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించింది. అందానికి సరికొత్త నిర్వచనమిచ్చింది.
Xలో షేర్ చేసిన వీడియోల ప్రకారం ఈ విజయంతో రొడ్రిగోజ్ మే 2024లో జరగనున్న మిస్ యూనివర్స్ అర్జెంటీనా కోసం జాతీయ ఎంపికలో బ్యూనస్ ఎయిర్స్‌కు ప్రాతినిధ్యం వహించబోతొంది. అక్కడ కూడా విజయాన్ని సొంతం చేసుకుంటే.. మిస్ యూనివర్స్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు అర్జెంటీనా జెండాను మోసుకెళ్తుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 28, 2024న మెక్సికోలో జరగనుంది.
Alejandra Marisa, a modelo que surpreendeu o mundo ao vencer o concurso Miss Universo para representar Buenos Aires aos 60 anos. Ela irá concorrer na seletiva nacional em maio de 2024 para representar a Argentina no concurso Miss Universo Mundial, no México em 28.09.2024. pic.twitter.com/u83vDUesGZ
— Fe MacMillan (@EnjoyJourney22) April 24, 2024
రొడ్రిగోజ్ ప్రయాణం అందం సాంప్రదాయ ప్రమాణాలను ధిక్కరిస్తుంది . సామాజిక నిబంధనలను సవాలు చేస్తుంది. విశ్వాసం, గాంభీర్యం, మనోజ్ఞతజై వయస్సు అడ్డంకులు కావంటూ వాటిని అధిగమిస్తుంది.
La abogada y periodista Alejandra Marisa Rodríguez de 60 años, ganó el concurso Miss Buenos Aires 2024 y estará compitiendo para representar a Argentina en Miss Universe.
La señora de atrás con el traje azul fue la primera finalista y tiene 73 años.
La verdad es que la ganadora… pic.twitter.com/Z6LcXnzIcj
— Molusco (@Moluskein) April 23, 2024
అయితే మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ పోటీలో పాల్గొనే అభ్యర్థులకు వయోపరిమితిని తొలగిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. ఈ అందాల పోటీల్లో 18-28 ఏళ్ల వయసున్న మహిళలే పాల్గొనేవారు. నిబంధనలు మార్చడంతో ఇటీవల డొమినికన్ రిపబ్లికన్‌కు చెందిన 47 ఏళ్ల హైదీ క్రూజ్ ఆ దేశ అందాల కిరీటం గెల్చుకుంది. ఈ ఏడాది విశ్వసుందరి పోటీల్లో హైదీ క్రూజ్ తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..