వామ్మో.. బుడ్డోడు మాములోడు కాదు..నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించేశాడు

|

Apr 02, 2023 | 5:03 PM

గిన్నిస్ రికార్టు సాధించాలని ఎంతోమంది విభిన్న రీతుల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. కొంతమంది ప్రాణాలు కూడా రిస్కులో పెట్టి ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తుంటారు.

వామ్మో.. బుడ్డోడు మాములోడు కాదు..నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించేశాడు
Saeed Rashed Almheiri
Follow us on

గిన్నిస్ రికార్టు సాధించాలని ఎంతోమంది విభిన్న రీతుల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. కొంతమంది ప్రాణాలు కూడా రిస్కులో పెట్టి ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తుంటారు. మరికొంతమంది ఎవరికీ సాధ్యం కాని పనుల్ని సరికొత్తగా చేసి గిన్నీస్ బుక్ లో చోట్ సంపాదించుకుంటారు. అయితే పిల్లలతో కలిసి ఆడుకునే వయసులో ఓ 4 గేళ్ల బాలుడు గిన్నీస్ బుక్ రికార్డు సాధించి ఔరా అనిపించాడు.

వివరాల్లోకి వెళ్తే యూఏఈకి చెందిన సయిద్ రషీద్ అల్మెహెరి అనే నాలుగేళ్ల బాలుడు ఓ పుస్తకాన్ని రచించి అతి పిన్న వయస్కుడిగా ప్రపంచంలో రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం అతను రాసిన ది ఎలిఫెంట్ సయిద్ అండ్ ది బేర్ అనే పుస్తకం యూఏఈలో అద్భుతమైన ఆదరణ పొందుతోంది. మార్చి 9 నాటికి అక్కడ 1000 కాపీలు అమ్ముడుపోయాయి. దీంతో సయిద్ రషీద్ రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులు తెలిపారు. మరో విషయం ఏంటంటే సయ్యద్ అక్క కూడా 8 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సాధించడం మరో విశేషం. ఆమె ఒక పుస్తకాన్ని రెండు భాషల్లో రాసిన అతిపిన్న వయస్కురాలిగా గిన్నిస్ రికార్డు సాధించింది.అంతే కాదు సయీద్‌ పుస్తకం రాయడానికి కూడా ఆమెనే ప్రేరణ కల్పించిందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది.