America: కొండచరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన బస్సు.. 34 మంది సజీవ సమాధి..

నయనతార యాక్ట్ చేసిన ఆక్సిజన్ సినిమా గుర్తుందా.. అందరూ బస్సులో వెళ్తున్న సమయంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడతాయి. దీంతో బస్సు బురదలో కూరుకుపోతుంది. ఇక అప్పటినుంచి అసలు కథ..

America: కొండచరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన బస్సు.. 34 మంది సజీవ సమాధి..
Landslides On Bus

Updated on: Dec 06, 2022 | 3:58 PM

నయనతార యాక్ట్ చేసిన ఆక్సిజన్ సినిమా గుర్తుందా.. అందరూ బస్సులో వెళ్తున్న సమయంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడతాయి. దీంతో బస్సు బురదలో కూరుకుపోతుంది. ఇక అప్పటినుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ప్రాణాలు రక్షించుకోవడం కోసం వారు ఏం చేశారు.. ప్రాణాపాయ స్థితిలో సజీవంగా ఎలా బయటపడ్డారు అనేది చాలా ఆసక్తికరంగా చూపించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. సరిగ్గా అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడి బస్సు కూరుకుపోయింది. కొలంబియాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సును పూర్తిగా ముంచేసింది బురద. మరో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రిసరాల్డా జిల్లాలోని ప్లూబో రికో నగరంలో ఆదివారం సాయంత్రం ఈ ఘోర దుర్ఘటన జరిగింది. భారీగా బురద ఉప్పొంగటంతో రహదారి రెండుగా చీలిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రెండు మీటర్ల లోతులో బురదలో కూరుకుపోయిన బస్సులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు అకారులు గుర్తించారు. బురద కమ్మేయడంతో ఓ కారులోని ఆరుగురు, ద్విచక్రవాహనంపై ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

వెంటనే సమచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. సుమారు 70 మంది వరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో ట్వీట్‌ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..