మ్యాచ్‌లో అభిమానుల ఘర్షణ.. దుస్తులు విప్పుతూ, గట్టిగా అరుస్తూ దాడి

|

Mar 07, 2022 | 7:32 AM

మెక్సికో(Mexico) లోని క్వెరెటారో నగరంలో జరిగిన మెక్సికన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 26 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్వెరెటారో, అట్లాస్ జట్ల మధ్య ఆట ప్రారంభమైన..

మ్యాచ్‌లో అభిమానుల ఘర్షణ.. దుస్తులు విప్పుతూ, గట్టిగా అరుస్తూ దాడి
Conflict In Foot Ball Match
Follow us on

మెక్సికో(Mexico) లోని క్వెరెటారో నగరంలో జరిగిన మెక్సికన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 26 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్వెరెటారో, అట్లాస్ జట్ల మధ్య ఆట ప్రారంభమైన కొంత సేపటి తర్వాతే ఈ గొడవలు(Clash) జరిగాయని వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. పది మంది పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. దీనిపై స్పందించిన ఫిఫా(FIFA) మరణాలు లేనప్పటికీ, ఇది విషాదం కాదని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఈ ఘటనను ఖండిస్తున్నామని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించింది. ఘర్షణ సమయంలో మానిటర్ ధ్వంసమైంది.

తమ ఆటగాళ్లు, అభిమానుల భద్రతకు ప్రాధాన్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని మ్యాచ్ నిర్వాహకులు వెల్లడించాచరు. అందరూ కలిసి ఒకే సారి దాడికి పాల్పడడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేయలేకపోయారన్నారు. ఫలితంగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనతో మ్యాచ్ చూస్తున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారని, పరిస్థితి చేజారిపోతుండటంతో వారు భయంతో పరుగులు తీశారని వివరించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడలని కోరారు.

Also Read

DJ Tillu: అట్లుంటది మరి.. ఓటీటీలో దుమ్ము రేపుతోన్న డీజే టిల్లు.. కేవలం రెండు రోజల్లోనే..

Akshay Kumar : బాలీవుడ్‌ స్క్రీన్‌కు ఆపద్భాందవుడిగా మారిన స్టార్ హీరో..

Alia Bhatt: గంగూబాయిగా అలియా కంటే ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా..