Violence in Bangladesh: మరో ఇద్దరు హిందువుల మృత దేహాలు లభ్యం.. హింసలో ఆరుకు చేరిన మొత్తం మృతుల సంఖ్య

|

Oct 16, 2021 | 7:52 PM

Violence in Bangladesh: బంగ్లాదేశ్‌లో జరిగిన హింసలో మరో ఇద్దరు మృతులను గుర్తించామని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. దీంతో ఇప్పటి వరకూ అల్లర్లలో మరణించినవారి..

Violence in Bangladesh: మరో ఇద్దరు హిందువుల మృత దేహాలు లభ్యం.. హింసలో ఆరుకు చేరిన మొత్తం మృతుల సంఖ్య
Violence In Bangladesh
Follow us on

Violence in Bangladesh: బంగ్లాదేశ్‌లో జరిగిన హింసలో మరో ఇద్దరు మృతులను గుర్తించామని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. దీంతో ఇప్పటి వరకూ అల్లర్లలో మరణించినవారి సంఖ్య ఆరుకు చేరుకుందన్నారు.  దసరా సందర్భంగా నిర్వహించిన దుర్గ పూజలో హిందూ దేవుడి ఒడిలో ఖురాన్ పెట్టిన వీడియో ఒకటి బయటకు రావడంతో నిరసనలు మొదలయ్యాయి. దసరా ఉత్సవాలకు రెడీ అవుతున్న హిందూ దేవుళ్లపై దేవాలయాలపై 200 మంది నిరసన కారులు దాడి చేశారని..పోలీసు అధికారి చెప్పారు. అంతేకాదు హిందూ ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిని దాడి చేసి కొట్టి చంపారని పోలీసులు చెప్పారు.

మరోవైపు శనివారం ఉదయం ఆలయం పక్కన ఉన్న చెరువు దగ్గర మరో హిందూ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు జిల్లా పోలీసు చీఫ్  తెలిపారు. ఇక నిన్న జరిగిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. హిందువులపై దాడికి పాల్పడిన నిందితులను కనుగొనడానికి తాము దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

హాజీగంజ్‌లోని హిందూ దేవాలయంపై దాడి చేసిన దాడిలో సుమారు 500మంది పాల్గొన్నారు. వీరిపై పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడిక్కడే నలుగురు మరణించారు. దేశవ్యాప్తంగా కనీసం 150 మంది హిందువులు గాయపడ్డారని హిందూ సంఘం నాయకుడు గోవింద చంద్ర ప్రామాణిక్ చెప్పారు. ప్రస్తుతం దాడికి గురైన 80 దేవాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు.

ముస్లిం అధిక జనాభాగలిగిన బంగ్లా దేశంలో తరచుగా హిందువులు హింసకు గురవుతున్నారు. దేశంలో నెలకొన్న అశాంతిని హింసను అదుపులోకి తీసుకునిరావడానికి పారామిలిటరీ రంగంలోకి దిగింది. శుక్రవారం రాజధాని ఢాకా ,  చిట్టగాంగ్‌లో మళ్ళీ హింస చెలరేగింది.. వేలాది మంది ముస్లిం నిరసనకారులు ఇటుకలను విసరడంతో వారిపై  పోలీసులు టియర్ గ్యాస్ ,  రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. మరోవైపు హింస వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి హై-స్పీడ్ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ సేవలు స్పష్టంగా నిలిపివేశారు. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఇప్పటికే హిందూ సంఘం నాయకులతో సమావేశమై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన వారిలో “ఇప్పటివరకు దాదాపు 90 మందిని అరెస్టు చేశారు.

Also Read:  రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ‘నాట్యం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. డ్యాన్స్‌పై ఇష్టంతోనే గెస్ట్‌గా హాజరవుతున్న చెర్రీ..