అమెరికాలోని మినియాపొలిస్ లో శనివారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆరేళ్ళ బాలికతో సహా మరో వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు. అయిదుగురు పురుషులు, మరో అయిదుగురు మహిళలతో ఘ్జర్షణకు దిగారని, ఒక సందర్భంలో రెచ్చిపోయిన ఉభయ వర్గాలు పరస్పరం కాల్పులు జరిపారని వారు చెప్పారు. అభం శుభం తెలియని ఆరేళ్ళ బాలిక నుదుటిపై బుల్లెట్ గాయమై ఆమె మరణించినట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తి తీవ్రంగా గాయాలకు గురై ఆసుపత్రి పాలయ్యాడని పోలీసులు వెల్లడించారు. వీరు ఎందుకు ఘర్షణ పడ్డారన్నది తెలియాల్సి ఉందన్నారు. ఆసుపత్రిలో చేరిన ఇతరులకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా గత ఏడా మే నెలలో 25 న ఇదే సిటీలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ …డెరెక్ చౌవిన్ అనే పోలీసు అధికారి చేతిలో మరణించాడు, ఫ్లాయిడ్ మెడపై డెరెక్ తన కాలిని బలంగా నొక్కి పెట్టడంతో ఫ్లాయిడ్ మరణించాడు. దీంతో దేశంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. డెరెక్ కి కోర్టు ఇటీవల 40 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
కాగా తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Shreya Ghoshal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ శ్రేయా ఘోషల్.. సోషల్ మీడియాలో పోస్ట్
Director Sukumar: రాజోలులో రూ..40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్..