China Landslide: చైనాలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి

చైనాలో విషాదం చోటుచేసుకుంది . అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందారు. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.00 AM గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.

China Landslide: చైనాలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి
Lanslide In China

Updated on: Jun 04, 2023 | 8:10 PM

చైనాలో విషాదం చోటుచేసుకుంది . అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందారు. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.00 AM గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టాయని తెలిపారు. ప్రమాదం జరిగిన చోట సుమారు 40 వేల మంది వరకు ప్రజలు ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయని, వాటి తీవ్రత వల్లే ఈ ప్రమాదం జరిగిఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే 180 మందితో కూడిన సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా వీరందరూ కూడా ఓ మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్నవారేనని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..