ముసలోడేగాని మహానుభావుడు.. 109 ఏళ్ల వయసు వచ్చినా తగ్గని ఎనర్జీ

|

May 08, 2023 | 12:12 PM

చాలామందికి 60, 70 ఏళ్ల రాగానే రిటైర్ అయిపోయి ఎంచక్క విశ్రాంతి తీసుకుంటారు. కాని ఆ వయసులో కూడా ఫిట్‌గా ఉండేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కొందరు కర్ర తోడు లేకుండా నడవలేరు.. మరికొందకు ఇతరుల సహాయం లేకుండా తమ పనులు కూడా చేసుకోలేరు.

ముసలోడేగాని మహానుభావుడు.. 109 ఏళ్ల వయసు వచ్చినా తగ్గని ఎనర్జీ
Vincent Dransfield
Follow us on

చాలామందికి 60, 70 ఏళ్ల రాగానే రిటైర్ అయిపోయి ఎంచక్క విశ్రాంతి తీసుకుంటారు. కాని ఆ వయసులో కూడా ఫిట్‌గా ఉండేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కొందరు కర్ర తోడు లేకుండా నడవలేరు.. మరికొందకు ఇతరుల సహాయం లేకుండా తమ పనులు కూడా చేసుకోలేరు. కానీ అమెరికాకు చెందిన విన్సెంట్ డ్రాన్‌ఫీల్డ్స్ అనే 109 ఏళ్ల వృద్ధుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆయన ఈ వయసులో కూడా ఫిట్‌గా ఉండటాన్ని చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ తాను సొంతంగా కారు నడుపుతాడు. కళ్లజోడు లేకుండానే న్యూస్ పేపర్ చదువుతాడు. చేతికర్ర సహాయం లేకుండానే బయటికి వెళ్లి ఇంటికి అవసరమైన సరకులు తీసుకొస్తాడు. అలాగే ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తుంటాడు.

109 ఏళ్లు వచ్చాక కూడా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటని అడగ్గా.. విన్స్‌ 21 ఏళ్ల వయసులో అగ్నిమాపక సహాయ కేంద్రంలో ఉద్యోగంలో చేరి, ఈ మధ్యనే రిటైర్‌ అయినట్లు ఆయన మనువరాలు ఒకరు తెలిపారు. దాదాపు 80 యేళ్ల పాటు అదే ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడాడని.. వారి దీవెనలే అతన్ని ఆరోగ్యంగా ఉంచాయని పేర్కొన్నారు. అయితే విన్స్‌ మాత్రం తన ఆరోగ్య రహస్యం రోజూ ఒక గ్లాసు పాలు తాగడం, శరీరాన్ని నిరంతరం కదిలించడమే అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..