Viral News: ఐస్‌లాండ్‌లో ఆవు బొమ్మను పోగొట్టుకున్న చిన్నారి… దానిని తిరిగి చిన్నారి చెంతకు చేర్చిన నెటిజన్లు

Viral News: ఓ 10 ఏళ్ల బాలిక మూడు నెలల క్రితం తనకుఇష్టమైన అందమైన ఆవు బొమ్మని పోగొట్టుకుంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొంతమంది నెటిజన్లు..

Viral News: ఐస్‌లాండ్‌లో ఆవు బొమ్మను పోగొట్టుకున్న చిన్నారి... దానిని తిరిగి చిన్నారి చెంతకు చేర్చిన నెటిజన్లు
Uk Girl
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2021 | 3:10 PM

Viral News: ఓ 10 ఏళ్ల బాలిక మూడు నెలల క్రితం తనకుఇష్టమైన అందమైన ఆవు బొమ్మని పోగొట్టుకుంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొంతమంది నెటిజన్లు.. ఆ ఆవు బొమ్మని కష్టపడి వెదికి తిరిగి చిన్నారి దగ్గరకు చేర్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 10 ఏళ్ల హాటీ సెయిన్స్  ఐస్‌ల్యాండ్‌లో కౌవీ (ఆవు బొమ్మకు పెట్టుకున్న ముద్దు పేరు) ని పోగొట్టుకుంది. తన ఇష్టమైన ఆవు బొమ్మని పోగొట్టుకున్న హాటీ దగ్గరకు తిరిగి మూడు నెలల తర్వాత కౌవీ చేరింది. దీంతో ఆ బాలిక ఆనందానికి హద్దులు లేవు.. వివరాల్లోకి వెళ్తే..

హటీ మూడు నెలల క్రితం ఐస్‌ల్యాండ్‌లోని విక్ ఐ మిర్డాల్ సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌లో కౌవీని (ఆవు  బొమ్మ) కోల్పోయింది. అప్పటి నుండి హాటీ  ఆవుబొమ్మ గురించి ఆలోచిస్తూనే ఉంది. కూతురు బాధను చుసిన హాటీ  తల్లిదండ్రులు,  క్రిస్సీ , రిచర్డ్ సెయిన్స్ లు  బొమ్మ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే  రిచర్డ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇక బొమ్మ దొరకదు అని ఆశలు వదులుకున్నారు. అయితే కూతురు బాధని చూసిన రిచర్డ్స్ చివరి ప్రయత్నంగా ట్రావెల్ ఐస్‌ల్యాండ్ పేరుతో ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. తన కూతురు.. కౌవీ బొమ్మ గురించి పడుతున్న ఆరాటాన్ని పోస్ట్ చేశాడు. హాటీ కి ఆవు బొమ్మమీద ఉన్న ప్రేమని అర్ధం చేసుకున్న కొంతమంది నెటిజన్లు.. తాము కౌవీని తిరిగి హాటీ దగ్గరకు చేరుస్తామని వాగ్దానం చేశారు.

రిచర్డ్ ఫేస్‌బుక్ పోస్ట్‌కు ప్రజల నుండి అధిక మద్దతు లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన సోషల్ మీడియా వినియోగదారులు హాటీ ముఖంలో తిరిగి నవ్వుని తీసుకుని రావడానికి చేతులు కలిపారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మూడు రోజుల్లో కౌవీ సురక్షితంగా హాటీ చెంతకు చేర్చారు.  ఈ మూడు రోజుల్లో “కౌవీ అనేక చేతులు మారింది. చాలామంది స్నేహితులను కూడా సంపాదించుకుంది. ఈ విషయాన్నీ రిచర్డ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కొన్ని ఫోటోలను కౌవీ ని తీసుకొచ్చిన విమాన సిబ్బంది సహా షేర్ చేశాడు. అంతేకాదు సర్వసాధారణంగా సోషల్ మీడియా అంటే వ్యతిరేకంగా ఆలోచిస్తాం.. కానీ పాజిటివ్ గా ఆలోచిస్తే.. దీనితో కూడా అనేక ప్రయోజనాలుంన్నాయి. మనకు సహాయం చేయడానికి ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తులున్నారు.. అని చెప్పారు.

టెడ్డి కౌవీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు టెడ్డీ ఓ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు, ఓడిన్నిస్‌ల్యాండ్ … కౌవీ ఈరోజు ఒక జలపాతం ముందు మోడల్ గా మారింది. అంటూ ఆ ఫోటోని షేర్ చేశారు. మరొకతను రేపు కౌవీ ఓ గొప్ప వ్యక్తితో విమానంలో లండన్ కు చేరుకుంటుంది. అనంతరం కౌవీ తన యజమాని హాటీని కలవనుంది.. అంటూ ప్రతి ఒక్కరూ తమ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  తమ ఇంటికి చేరుకున్న కౌవీ గురించి హటీ తల్లి క్రిస్సీ సెయిన్స్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.  కౌవీ ఫోటోలను షేర్ చేశారు. ప్రసుత్తం హాటీ కౌవీ ల ప్రేమ నెటిజన్లను ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Also Read: పెళ్లింట విషాద ఛాయలు.. చికిత్స పొందుతూ నేడు నవ వధువు మృతి.. నిన్న వరుడు మృతి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!