Nischa Shah: బ్యాంకర్ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఆమె ఒకప్పుడు లండన్ లో పనిచేస్తూ ఏటా సుమారు రూ. 2 కోట్ల జీతం అందుకుంది. దాదాపు పదేళ్ల అనుభవం.. మరింతగా పైకి ఎదిగే అవకాశం ఉన్నా కానీ వాటన్నింటినీ వదులుకొని యూట్యూబర్‌గా అవతారం ఎత్తింది. నిత్యం ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగ జీవితానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టింది. కెమెరా పట్టుకుని సొంతంగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అంతే.. ఏడాది తిరిగేసరికి ఉద్యోగ జీవితంలో సంపాదించిన డబ్బుకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఆర్జిస్తోంది. ఆమె పేరే నిశ్చా షా.

ఒక్కసారిగా తన కెరీర్ ను మార్చుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఆమె ఇటీవల సీఎన్ బీసీ వార్తా చానల్ తో షేర్ చేసుకుంది. జీవితం ఏదో వెలితిగా అనిపించిందని.. చేస్తున్న ఉద్యోగంలో సవాళ్లేమీ లేకపోవడం, తెలివితేటలను పెంచేదిగా లేకపోవడంతో ఏదైనా అర్థవంతమైన పని చేయాలని అనుకున్నట్లు నిశ్చా షా వివరించింది. ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించాననీ కానీ అప్పటివరకు తాను చేసిన పని కేవలం కార్పొరేషన్లు, ప్రభుత్వాలకు మాత్రమే ఉపయోగపడిందని నిశ్చా షా తెలిపింది. అందుకే 2023 జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్ లో పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన కంటెంట్ క్రియేటర్ గా మారినట్లు చెప్పింది. ఆమె తీసుకున్న రిస్క్ ఫలించింది. 2023 మే నుంచి 2024 మే మధ్య ఆమె యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా రూ. 8 కోట్లకుపైగా సంపాదించింది. పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు, ఉత్పత్తులు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యాల ద్వారా బాగా ఆర్జించింది. డబ్బు వెనక పరుగులు పెట్టడం మానేశాననీ అందుకు బదులుగా తన అభిరుచి వెంట పరిగెడుతున్నాననీ ఇందులోనే ఆనందం వెతుక్కుంటున్నట్లు నిశ్చా షా చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..