Anshuman Singh: కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.

Anshuman Singh: కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Jul 16, 2024 | 5:44 PM

అమరవీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ సతీమణి స్మృతిపై ఆయన తల్లిదండ్రులు మంజుదేవి, రవిప్రతాప్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన కీర్తిచక్ర అవార్డును తాకే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుడు అన్షుమాన్ సింగ్ దశదిన కర్మ అనంతరం కోడలు స్మృతి వెళ్లిపోయిందని తెలిపారు. తమ కొడుకుకు వచ్చిన కీర్తిచక్ర అవార్డును కోడలు స్మృతి సింగ్ ప్రేమగా తీసుకెళ్తే బాగుండేదనీ కొన్నిరోజులు తమతో ఉండి ఆప్యాయంగా మసులుకొని..

అమరవీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ సతీమణి స్మృతిపై ఆయన తల్లిదండ్రులు మంజుదేవి, రవిప్రతాప్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన కీర్తిచక్ర అవార్డును తాకే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుడు అన్షుమాన్ సింగ్ దశదిన కర్మ అనంతరం కోడలు స్మృతి వెళ్లిపోయిందని తెలిపారు. తమ కొడుకుకు వచ్చిన కీర్తిచక్ర అవార్డును కోడలు స్మృతి సింగ్ ప్రేమగా తీసుకెళ్తే బాగుండేదనీ కొన్నిరోజులు తమతో ఉండి ఆప్యాయంగా మసులుకొని ఆ తర్వాత తమకు ఉన్నదంతా ఆమె తీసుకెళ్లినా ఏమీ అనుకునే వాళ్లం కాదనీ ఓ మీడియాతో అన్షుమాన్‌ తల్లితండ్రులు పేర్కొన్నారు. అన్షుమాన్ సింగ్‌ అమరుడయ్యాక కోడలు, వాళ్ల పుట్టినింటి వాళ్లు తమతో ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించిందనీ కోడలు స్మృతి ఇప్పుడు కనీసం తమతో మాట్లాడటం కూడా లేదనీ అన్నారు. అన్షుమాన్‌కు తానంటే చాలా ప్రేమ అనీ తన వల్లే అతడు డాక్టర్ అయ్యాడనీ చెప్పుకొచ్చారు. తన కొడుకు గుర్తుగా ఇప్పుడు లూసీ అనే కుక్కపిల్ల మాత్రమే ఇంట్లో మిగిలిందనీ ఆ కుక్కపిల్లను అన్షుమాన్ చాలా బాగా చూసుకునేవాడని అన్షుమాన్ తల్లి మంజుదేవి మీడియాతో చెప్పారు.

5 నెలల క్రితమే తమ కుమారుడికి స్మృతితో పెళ్లైందనీ వారికి ఇంకా సంతానం కలగలేదనీ అన్షుమాన్ తండ్రి అన్నారు. అయినా తమ కుమారుడికి వచ్చిన కీర్తిచక్ర పురస్కారాన్ని కోడలు తీసుకెళ్లిపోయిందనీ తమకు తమ కుమారుడు ఫొటో మాత్రమే మిగిలిందనీ ఇలాంటి సందర్భాల్లో పురస్కారాలు వచ్చినప్పుడు వాటిని తల్లిదండ్రులకే అప్పగించేలా నెక్ట్స్ టు కిన్ నిబంధనలను మార్చాలనీ కోరారు. దీనిపై తాను విపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా మాట్లాడాననీ అన్నారు. సియాచిన్‌లో సైనిక విధులు నిర్వర్తించిన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ గత ఏడాది జులై 19న తన సహచరులను కాపాడే క్రమంలో అమరుడయ్యాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్షుమాన్ సింగ్‌కు కీర్తిచక్ర అవార్డును ప్రకటించింది. ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి మంజుదేవి కలిసి ఈ పురస్కారాన్ని జులై 5న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అయితే సోషల్ మీడియాలో స్మృతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఢిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.