Corona: కరోనా ప్రళయ తాండవం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. విలవిల్లాడుతున్న కంట్రీ..
పుట్టింటిపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. మహమ్మారి దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో డ్రాగన్ కంట్రీ గడగడలాడుతోంది.
డిసెంబర్ నెలలో 20 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి వైరస్ సోకింది. ఇది చైనా మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం. ఈ క్రమంలో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డిసెంబర్ 23న అంతర్గతంగా సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ లో దిగ్భ్రాంతికి గురి చేసే ఈ విషయం వెలుగుచూసింది. అంతేకాదు, డిసెంబర్ మూడో వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. చైనాలో ఇంతకు ముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. 2022 జనవరి 19న ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకే రోజున దాదాపు 4 కోట్ల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలస్తోంది. అయితే ఈ మీటింగ్ మినిట్స్ లో కరోనా మరణాలు ఎన్ని నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం పేర్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

