ఎట్టకేలకు కదిలిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుఫలకం

|

Nov 28, 2023 | 10:05 AM

అతి పెద్ద మంచుఫలకం కదిలింది. అంటార్కిటిక్‌ తీర రేఖనుంచి విడిపోవడంతో ఈ మంచుఫలకం ఏర్పడింది. దాదాపు దుబాయ్‌ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన ఎ-23ఎ.. 30 ఏళ్లకుపైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది. 1986లో అంటార్కిటిక్‌ తీరరేఖ నుంచి ఇది విడిపోయింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి, వెడ్డెల్‌ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది.

అతి పెద్ద మంచుఫలకం కదిలింది. అంటార్కిటిక్‌ తీర రేఖనుంచి విడిపోవడంతో ఈ మంచుఫలకం ఏర్పడింది. దాదాపు దుబాయ్‌ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన ఎ-23ఎ.. 30 ఏళ్లకుపైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది. 1986లో అంటార్కిటిక్‌ తీరరేఖ నుంచి ఇది విడిపోయింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి, వెడ్డెల్‌ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది. ఈ మంచుఫలకం విస్తీర్ణం 4 వేల చదరపు కిలోమీటర్లు. దుబాయ్‌ విస్తీర్ణం 4,114 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం మంచుఫలకం సాగర అడుగు భాగం నుంచి వేరుపడి.. వేడి జలాల వైపు కదులుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలోని చాలా పెద్ద మంచుఫలకాలకు భిన్నంగా.. ఎ-23ఎ తన ఆవిర్భావం నాటినుంచి ఇప్పటిదాకా కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే కదిలిందని వారు పేర్కొన్నారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హర్భజన్‌సింగ్‌ను అనుకరిస్తూ బౌలింగ్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

TOP 9 ET News: రూ.300 కోట్ల రెమ్యూనరేషన్..దటీజ్‌ ఐకాన్ స్టార్ రేంజ్‌! |మర్చిపోలేకున్నా..సమంత ఎమోషన్

Rathika Rose: భారీగా రెమ్యూనరేషన్‌ !! పాపకు బానే గిట్టుబాటైంది !!

100 కోట్ల రికార్డ్‌ కొట్టిన సినిమాను మిస్ చేసుకుంది !!

Vijay Varma: పెళ్లికి వేళ కాలేదా ?? నవ్వుతూ.. షాకిచ్చిన తమన్నా లవర్‌

 

 

Follow us on