Isreal: ఇజ్రాయెల్‌పై హమస్ అంత ఈజీగా ఎలా ఎటాక్ చేసింది..? ఇజ్రాయెల్ చెప్తుందంటే..
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు జరిపిన దాడుల్లో ఒక్క మ్యూజిక్ ఫెస్టివల్ ప్రాంగణంలోనే ఇప్పటి వరకు 260 మృతదేహాలను గుర్తించారు. మొత్తం 700 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడం ఇజ్రాయెల్‌కు కొత్తేమీ కాదు. అయితే శనివారం జరిగిన మారణహోమం ఆ దేశం ఊహించని పరిణామం. దీనికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్ సైన్యంలో సన్నద్ధత లోపించడమే.
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు జరిపిన దాడుల్లో ఒక్క మ్యూజిక్ ఫెస్టివల్ ప్రాంగణంలోనే ఇప్పటి వరకు 260 మృతదేహాలను గుర్తించారు. మొత్తం 700 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడం ఇజ్రాయెల్‌కు కొత్తేమీ కాదు. అయితే శనివారం జరిగిన మారణహోమం ఆ దేశం ఊహించని పరిణామం. దీనికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్ సైన్యంలో సన్నద్ధత లోపించడమే. 2006లో జరిగిన లెబనాన్ ఘర్షణల సమయంలో హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్‌పై వేల రాకెట్లతో విరుచుకుపడింది. అనేకమంది పౌరులు ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివాటిని తిప్పికొట్టడానికి స్వీయ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ను ఇజ్రాయోలః 2011లో వినియోగంలోకి తెచ్చింది. ఐరన్ డోమ్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. దీనికి అమెరికా తోడ్పాటు అందించింది. ప్రస్తుతం దుర్భేద్యమనుకున్న ఐరన్ డోమ్‌లో లోపాలు తాజాగా బయటపడ్డాయి. ఈ కంచె వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచుతోంది. హెజ్‌బొల్లా, ఇరాన్‌తో పోలిస్తే హమాస్ నుంచి పెద్దగా ముప్పు ఉండబోదన్న భరోసాలో ఇజ్రాయెల్ ఉండిపోయింది. ఈ నేపథ్యంలో పటిష్ఠమైన కంచె నిర్మించినప్పటికీ దాని వెంబడి సరిపడా బలగాలను మోహరించలేదు. ఈ కంచెను ధ్వంసం చేసుకొని.. భారీ స్థాయిలో హమాస్ మిలిటెంట్లు దాడులకు దిగే సాహసం చేస్తారని ఊహించలేదు. తీవ్రవాదులు తక్కువ సంఖ్యలో దొంగచాటుగా వస్తారన్న అంచనాలోనే ఉండిపోయింది. అందువల్ల అప్రమత్తంగా లేదు. మిలిటెంట్లు ఇప్పుడు కంచెను నాశనం చేసి మరీ తమ భూభాగంలోకి చొచ్చుకురావడం ఇజ్రాయెల్‌ను పూర్తి విస్మయంలో పడేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..