టీచర్‌కు రూ.88 కోట్ల నష్టపరిహారం.. ఆ రోజు ఏం జరిగిందంటే ??
అమెరికాలోని వర్జీనియాలో ఆరేళ్ల విద్యార్థి కాల్పుల్లో గాయపడిన టీచర్ అబిగైల్ జ్వెర్నర్, స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై దావా వేసింది. బుల్లెట్ గాయాలతో కూడా ఆమె మిగిలిన పిల్లలను రక్షించింది. విద్యార్థి తుపాకీ ఉన్నా పట్టించుకోని నిర్వాహకుల నిర్లక్ష్యానికి కోర్టు $10 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది. ఇది స్కూల్ భద్రతలో నిర్లక్ష్యాన్ని నిరూపిస్తూ వచ్చిన చారిత్రక తీర్పు.
అమెరికా వర్జీనియాలోని ఎలిమెంటరీ స్కూల్‌లో 2023 జనవరిలో దారుణం జరిగింది. తరగతి గదిలో ఉన్న టీచర్ పై.. 6 ఏళ్ల విద్యార్థి హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరిపాడు. టీచర్ అబిగైల్ చేతికి, ఛాతీకి బుల్లెట్‌లు తగిలాయి. ఓవైపు రక్తస్రావం అవుతున్నా.. తరగతి గదిలో ఉన్న మిగతా పిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే వారందరినీ క్షేమంగా బయటకు పంపించారు. ఆ తర్వాతే ఆమె ఆస్పత్రికి వెళ్లారు. ఆ టీచర్ చేతికి ఐదుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ.. బుల్లెట్ ఇప్పటికీ ఆమె ఛాతీలోనే ఉండిపోయింది. ఈ ఘటనకు మాజీ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఎబోనీ పార్కర్ నిర్లక్ష్యమే కారణమని జ్వెర్నర్ ఆరోపించారు. కాల్పులు జరగడానికి ముందు ఆ బాలుడి వద్ద తుపాకీ ఉందని తోటి విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ.. పార్కర్ ఆ సమాచారాన్ని పట్టించుకోలేదని అబిగైల్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ఆరోపణలను పార్కర్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. కాల్పులు జరగడాన్ని తాము అస్సలే ఊహించలేమని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం నిజంగానే నిందితుడి వద్ద తుపాకీ ఉన్న విషయం వారి దృష్టికి వెళ్లిందని గ్రహించింది.పాఠశాల నిర్వాహకురాలికి 10 మిలియన్ డాలర్ల నష్ట పరిహాహారాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. స్కూల్లో భద్రతా హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో నిరూపిస్తూ అమెరికాలో ఓ చారిత్రక తీర్పు వచ్చింది. 6 ఏళ్ల విద్యార్థి చేతిలో కాల్పులకు గురైన టీచర్ అబిగైల్ వేసిన సివిల్ దావాలో.. స్కూల్ నిర్వాహకురాలిని కోర్టు 10 మిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో 88 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థి తుపాకీ తెచ్చాడని తోటి పిల్లలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని కోర్టు స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బహుబలి అరటి హస్తం..ఏకంగా 80 పండ్లు.. సెల్ఫీ దిగిన కొనుగోలుదారులు
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు.. ఇక పల్లెల్లోనూ హైస్పీడ్ నెట్
భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. శత్రు దేశాలకు ఇక.. దబిడి దిబిడే
నడిరోడ్డుపై వ్యక్తి పరుగులు.. ప్లాన్డ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

