AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బహుబలి అరటి హస్తం..ఏకంగా 80 పండ్లు.. సెల్ఫీ దిగిన కొనుగోలుదారులు

బహుబలి అరటి హస్తం..ఏకంగా 80 పండ్లు.. సెల్ఫీ దిగిన కొనుగోలుదారులు

Phani CH
|

Updated on: Nov 10, 2025 | 3:50 PM

Share

తణుకులో ఒకే అరటి గెల హస్తానికి 80 కాయలు కాసి అబ్బురపరిచింది. సాధారణంగా 14-20 కాయలు ఉండే కర్পূరం రకం అరటికి ఇలాంటి 'బాహుబలి' హస్తం రావడం అరుదు. 30 ఏళ్ల వ్యాపారంలో ఎప్పుడూ చూడలేదని యజమాని నాని తెలిపారు. స్థానిక నేల సారవంతం, అధిక పోషకాల వల్లే ఇలాంటి అద్భుతం జరిగిందని ఉద్యానశాఖ అధికారిణి వివరించారు. ప్రజలు ఆశ్చర్యంతో చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు వస్తున్నారు.

మనలో అరటి గెలను చూడని వారంటూ ఉండరు. అరటి పండ్లు కొనటానికి వెళ్లినప్పుడు గెలలోని మనకు నచ్చిన హస్తం చూపించి.. అది కోసివ్వమని మనం అడుగుతూ ఉంటాం. సాధారణంగా ఒక్కో హస్తంలో డజను వరకు పండ్లు ఉంటాయి. పెద్ద హస్తాలున్న గెలయితే.. 20 వరకు కూడా పండ్లు ఉంటాయి. అయితే.. తణుకులో ఓ అరటి చెట్టుకు వచ్చిన గెలలోని హస్తంలో ఏకంగా 80 కాయలున్నాయి. తణుకులో నాని అనే అరటి పండ్ల వ్యాపారి సొంత తోటలోని చెట్టుకు ఉన్న ఈ బాహుబలి హస్తాన్ని చూడటానికి జనం పెద్దసంఖ్యలో వచ్చి.. ఆ హస్తంతో సెల్ఫీ దిగుతున్నారు. గత 30ఏళ్లకు పైగా తాను అరటి పండ్ల వ్యాపారంలో ఉన్నా.. ఎప్పుడూ ఇంత పెద్ద హస్తాన్ని చూడలేదని నాని తెలిపారు. కర్పూరం రకానికి అరటి గెలలోని హస్తానికి 14 నుంచి 20 కాయలుంటాయని,కానీ, ఈ బాహుబలి హస్తంలో 80 అరటి కాయలున్నాయని ఆయన తెలిపారు. పలువురు దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై ఉద్యానశాఖ అధికారిణి ప్రియదర్శిని స్పందించారు. తణుకు,పెరవలి ప్రాంతాల నేల.. అరటి సాగుకు అనుకూలమని, ఆమె వివరించారు. అందుకే ఇక్కడి గెలలు పొడవుగా, కాయలు పెద్దసైజులో ఉంటాయని ఆమె వివరించారు. కొన్నిసార్లు నేలలో పోషకాలు అధికమైనప్పుడు.. ఈ విధంగా హస్తంలో ఎక్కువ సంఖ్యలో కాయలుంటే అవకాశముందని ఆమె అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు.. ఇక పల్లెల్లోనూ హైస్పీడ్ నెట్

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. శత్రు దేశాలకు ఇక.. దబిడి దిబిడే

నడిరోడ్డుపై వ్యక్తి పరుగులు.. ప్లాన్డ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

మన అనకాపల్లి అమ్మాయే.. వరల్డ్‌ కప్‌ క్రికెట్ కామెంటేటర్‌

కాలు నొప్పిగా ఉంది.. వైద్యం చేయమని అడిగిన వీధి కుక్క.. వీడియో వైరల్‌