అవిభక్త కవల పాములను చూశారా ??
అరుదైన రెండు తలల పాము ఇటీవల శ్రీకాకుళం జిల్లా పాలస సమీపంలోని అంబుసోలి గ్రామంలో కనిపించి ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఇది అవిభక్త కవల పాము. సాధారణంగా ఇలాంటివి పుట్టిన కొద్దిసేపటికే మరణిస్తాయి. కానీ, ఈ పాము ఆరోగ్యంగా, చురుగ్గా కదులుతోంది. నాగజెర్రి జాతికి చెందిన ఈ అరుదైన జీవవైవిధ్యాన్ని పశుసంవర్ధక శాఖ సంచాలకులు అద్భుతంగా పేర్కొన్నారు, ఒకే పిండంలో రెండు పాములు ఉన్నప్పుడు ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతాయని వివరించారు.
కొన్ని పాములు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అవి చూసేందుకు వింతగా ఉంటాయి. పురాణల్లోనో, సినిమాల్లోనో చూసి ఉంటాం రెండు తలలు లేదా ఐదు తలల పాముల్ని. అంతే తప్ప మామూలుగా చూడటం కుదరదు. పైగా తాచుపాము జాతుల్లోని ప్రత్యేక పాములే ఇలా ఉంటాయి. ఆ ఐదు తలలు సెపరేట్‌గా ఉండి ఆ తలలన్నింటికి ఒకటే దేహంలా కింద భాగం ఉంటుంది. యూకేలోని ఓ దుకాణంలో రెండు తలలు కలిసిపోయిన పాము కనిపించింది. అచ్చం మనుషులకు జన్మించే అవిభక్త కవలల మాదిరిగా ఆ పాము ఉంది. నిజానికి అలా జన్మించినవి పుట్టిన కొద్దిసేపటికే చనిపోతాయి. కానీ ఇది అలా కాదు. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంది. చురుగ్గా కదులుతోంది. ఆహారం తీసుకునేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతుందేమో గానీ చూస్తే మాత్రం మాములు పాములా పాకుతుండటం విశేషం. ఇక ఇది నాగజెర్రి రకానికి చెందిన అవిభక్త కవల పాము. ఇది పేరుకు రెండు తలలను కలిగున్నా.. ఒకే తోక ఉంది. గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస సమీప అంబుసోలి గ్రామంలో కనిపించింది. వీటిలో ఒక పాము రోడ్డు దాటుతుండగా.. మరొకటి దాన్ని అనుసరిస్తోంది. స్థానికులు వీటిని మెల్లగా పొదల్లోకి పంపించారు. పాముల్లో అవిభక్త కవలలు ఉండటం చాలా అరుదు అని పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ మట్ట రవికృష్ణ చెప్పారు. ఒక పిండంలో రెండు పాములు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌లో ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు ?? లారిస్సా ఏమంది అంటే
టీచర్‌కు రూ.88 కోట్ల నష్టపరిహారం.. ఆ రోజు ఏం జరిగిందంటే ??
బహుబలి అరటి హస్తం..ఏకంగా 80 పండ్లు.. సెల్ఫీ దిగిన కొనుగోలుదారులు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

