ఒక్క కారుకు దారిచ్చేందుకు ఆగిన పదుల వాహనాలు

|

May 14, 2024 | 6:48 PM

మన దేశంలో వాహనదారుల సంగతి తెలిసిందేగా.. ట్రాఫిక్ పోలీసులు లేకపోతే రెడ్ సిగ్నల్ పడ్డా ఆగరు. ఇతరులకు సైడ్ ఇమ్మన్నా ఓ పట్టాన ఇవ్వరు. కానీ ట్రాఫిక్ నిబందనలను పాటించే విషయంలో జపనీయుల సహనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ షాపింగ్ కేంద్రంలోంచి రోడ్డెక్కేందుకు వచ్చిన ఓ కారు కోసం పదుల సంఖ్యలో వాహనదారులు ఓపికగా నిరీక్షించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మన దేశంలో వాహనదారుల సంగతి తెలిసిందేగా.. ట్రాఫిక్ పోలీసులు లేకపోతే రెడ్ సిగ్నల్ పడ్డా ఆగరు. ఇతరులకు సైడ్ ఇమ్మన్నా ఓ పట్టాన ఇవ్వరు. కానీ ట్రాఫిక్ నిబందనలను పాటించే విషయంలో జపనీయుల సహనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ షాపింగ్ కేంద్రంలోంచి రోడ్డెక్కేందుకు వచ్చిన ఓ కారు కోసం పదుల సంఖ్యలో వాహనదారులు ఓపికగా నిరీక్షించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ బ్లాక్ ఎస్ యూవీని రోడ్డెక్కించేందుకు వీలుగా కాస్త ఆగాలంటూ సెక్యూరిటీ సిబ్బంది వాహనదారులకు చేయి చూపించారు. దీంతో రోడ్డుపై వస్తున్న వాహనదారులంతా ఆగారు. హారన్లు కొట్టకుండా ఆ కారు వెళ్లే దాకా నిరీక్షించారు. సెక్యూరిటీ సిబ్బంది తొలుత ఎస్ యూవీలోని వ్యక్తికి తల వంచి నమస్కరించారు. కొన్ని క్షణాలపాటు నిరీక్షించినందుకు ఇతర వాహనదారులకు కూడా అదే విధంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఇదేం చూపురా నాయనా.. నెటిజన్లు బెంబేలు.. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు

మీ ముఖం చందమామలా వెలిగిపోవాలంటే ఇలా చేయండి !!

Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చక్కటి ఫుడ్స్ ఇవే..

Allu Aravind: రామాయణ మేకర్స్‌కు నోటీసులిచ్చిన అల్లు అరవింద్

Kannappa: ఏంటీ ?? కన్నప్పలో ప్రభాస్‌ శివుడు కాదా ?? బిగ్ ఝలక్ ఇచ్చిన మంచు బాబు

Follow us on