అమెరికా వెళ్లటం ఇక కష్టమే బాస్.. టూరిస్ట్ వీసాపైనా సవాలక్ష ఆంక్షలు

Updated on: Dec 22, 2025 | 1:47 PM

అమెరికా టూరిస్ట్ వీసాపై కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వీసా గడువు తేదీతో సంబంధం లేకుండా, ఇకపై కస్టమ్స్ అధికారులు I-94 ఫారంలో నమోదు చేసే 'అడ్మిట్ అంటిల్ డేట్' మాత్రమే పర్యాటకుల బస గడువును నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం పర్యాటకుల వీసాలపై మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

సుంకాల నుంచి వీసాల దాకా సెకండ్‌ టర్మ్‌లో ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టడమే పనిగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పర్యాటకుల వీసా గడువుతేదీపై ఫోకస్‌ చేశారు. అమెరికాకు వచ్చి ఎక్కడ పిల్లలను కనేస్తారోనని ముందే రిజెక్ట్‌ స్టాంప్‌ కొట్టేయడానికి ట్రంప్‌ సర్కార్‌ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఏ చిన్న అనుమానం వచ్చినా టూరిస్ట్‌ వీసా ఇవ్వలేమంటూ.. అమెరికా రాయబార కార్యాలయం సోషల్‌ మీడియాలో ఏకంగా అఫిషియల్‌ సర్క్యులర్‌ కూడా ఇచ్చేసింది. సాధారణంగా అమెరికా వీసాపై గడువు తేదీని పేర్కొంటారు. వీసాపై ఉన్న నిర్ణీత డేట్‌ వరకూ అగ్రరాజ్యంలో చట్టబద్ధంగా ఉండొచ్చని అందరూ అనుకుంటారు గానీ, అది వాస్తవం కాదని మనదేశంలోని అమెరికన్ ఎంబసీ క్లారిటీ ఇచ్చింది. ఇలా వెళ్లేవారు అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చనే దానిపై మరోసారి స్పష్టతనిస్తూ.. తాజాగా తమ ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ పోస్ట్‌ చేసింది. దాని ప్రకారం.. అంతర్జాతీయ పర్యాటకులు అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చనేది గతంలో మాదిరిగా వారి వీసాపై ఉన్న గడువు తేదీపై ఆధారపడి ఉండదు. ఇకపై.. టూరిస్టులు అగ్రరాజ్యంలోకి రాగానే..అక్కడి కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ అధికారి సంబంధిత గడువును నిర్ణయిస్తారు. వారు ఎంతకాలం ఉండొచ్చనేది తెలుసుకోవాలంటే.. వారి ‘ఐ-94’ పత్రంపై ఉండే ‘Admit Until Date’ వివరాలను చెక్‌ చేసుకోవాలి’’ అని ఎంబసీ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. రెండు నెలల క్రితం కూడా భారత్‌లోని అమెరికా ఎంబసీ ఇదే విధమైన సూచనలు చేసింది. వలసదారులు, విదేశీ పర్యాటకులపై ట్రంప్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న నేపథ్యంలో ఎంబసీ ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేస్తోంది. గతంలోనూ వీసా గడువు తేదీ దాటిన తర్వాత అమెరికాలో ఉంటే బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించింది. అమెరికా వెళ్లే పర్యాటకులకు ఐ-94 పత్రం తప్పనిసరి. అమెరికాలోకి ప్రవేశించగానే కస్టమ్స్‌ అధికారులు ఈ ఫారమ్‌పై పర్యాటకుల గడువు తేదీని నమోదు చేస్తారు. అప్పటివరకు మాత్రమే అగ్రరాజ్యంలో చట్టబద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ తేదీ.. వీసాలపై ఉండే గడువు తేదీతో సరిపోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో వీసా గడువు తీరే తేదీ కన్నా ముందే ఐ-94 ఫారమ్‌లో చివరి తేదీ ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

తల్లీ కూతుళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేశారు

నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే

అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు.. బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌

కోట్లలో ఇండియన్ యూట్యూబ‌ర్ సంపాదన.. లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద విల్లాలు.. ఎలాగంటే ??