చైనా సముద్రంలో కూలిన అమెరికా విమానం

Updated on: Oct 28, 2025 | 5:48 PM

అమెరికాకు చెందిన రెండు వైమానిక దళ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. అమెరికా నేవీ చాపర్‌‌, ఫైటర్‌ జెట్‌ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెండూ ప్రమాదానికి గురయ్యాయి. అయితే, ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

మొదటగా 2:45 గంటల ప్రాంతంలో ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. ఆ తర్వాత అర గంట వ్యవధిలోనే అంటే.. 3:15కు బోయింగ్‌ ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌ ఫైటర్‌ జెట్‌ కూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది, ఫైటర్‌ జెట్‌లో ఇద్దరు ఉన్నారు. వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన నావికా విమానం, హెలీకాప్టర్ రెండూ USS నిమిట్జ్ షిప్ నుండి ఆపరేట్ చేస్తున్నవి కావడం విశేషం. ఇవి ‘బ్యాటిల్ క్యాట్స్’, ‘ఫైటింగ్ రెడ్‌కాక్స్’ స్క్వాడ్రన్‌లకు చెందినవి. పైలట్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని, సాధారణ ఆపరేషన్ల సమయంలో జరిగిన ఈ ఘటనలపై విచారణ జరుగుతోందని అమెరికా పసిఫిక్ ఫ్లీట్ అధికారులు ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ISRO: మరో అతిపెద్ద రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దం

Jupiter: భూమిని రక్షించిన బృహస్పతి.. లేకుంటే

గంటకు 85 కి.మీ వేగంతో కదులుతున్న మొంథా

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌.. విశాఖలో కూలిన భారీ వృక్షం

ఓడలరేవు దగ్గర సముద్రం కల్లోలం.. ఎగసిపడుతున్న రాకాసి అలలు