Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా ల్యాబ్‌లో డేంజరస్ ఫంగస్‌ సృష్టి..ఈసారి వ్యవసాయరంగంపై

చైనా ల్యాబ్‌లో డేంజరస్ ఫంగస్‌ సృష్టి..ఈసారి వ్యవసాయరంగంపై

Phani CH

|

Updated on: Jun 11, 2025 | 5:14 PM

ప్రపంచవ్యాప్తంగా లక్షలమందిని కబళించిన కరోనా వైరస్‌ను మనం ఇంకా మరచిపోలేదు. కరోనాను చైనానే సృష్టించిందని అమెరికాతోపాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ నమ్ముతున్నాయి. ఇప్పుడు అమెరికా ఒక బ్లాస్టింగ్‌ న్యూస్‌ చెబుతోంది. ఐదేళ్ల కిందట వైరస్‌ దాడిచేస్తే, ఇప్పుడు ఫంగస్‌ ఒక అస్త్రంగా మారుతోందని అగ్రరాజ్యం డేంజర్‌బెల్స్‌ మోగిస్తోంది.

అవును, చైనా ఇప్పుడు మరో భారీ కుట్రకు ప్లాన్‌ చేస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల అమెరికాలో అరెస్టయిన ఇద్దరు చైనా సైంటిస్టులను విచారించగా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన ఇద్దరు చైనా సైంటిస్టుటు జియాన్‌, లియులను FBI తనదైనశైలిలో విచారించగా ఈ విషయం వెల్లడయినట్టు ఫెడరల్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌ కశ్యప్‌ పటేల్‌ తెలిపారు. అరెస్టయిన చైనీయుల దగ్గర ఫుసారియమ్‌ గ్రామినేరమ్‌ అనే ఫంగస్‌ ఉందని, ఇది అగ్రికల్చరల్‌ టెర్రరిజానికి ఆయుధం అంటూ అమెరికా ఆరోపిస్తోంది. దానిని మిషిగన్‌ యూనివర్శీటీకి పరిశోధనలకోసం తరలించినట్టు వెల్లడించారు. అసలు ఈ ప్రమాదకర ఫ్యాథోజన్‌ వల్ల ఏం జరగబోతోంది? అసలు అమెరికా ఈ సూక్ష్మజీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది అంటే చైనా ఫంగస్‌ ఏం చేస్తుందో తెలిస్తే యావత్‌ ప్రపంచం షాకవ్వాల్సిందే. ఎందుకంటే చైనా ప్రయోగించే ఆ ప్రమాదకర ఫ్యాథోజన్‌ వల్ల వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై ఈ ఫంగస్‌ దాడి చేస్తుంది. అంతేకాదు, ఈ ఫంగస్‌ హెడ్‌ బ్లైట్‌ అనే వ్యాధికి దారితీస్తుంది. ఫలితంగా మనుషులు, పశువుల్లో వ్యాధులు తీవ్రంగా ప్రబలుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్‌తో ఆర్థిక విధ్వంసం సాగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయాన్నే కాఫీ, టీలకు బదులు ఇవి తాగండి.. సూపర్‌ బెనిఫిట్స్‌..!

ఎయిర్ పోర్ట్ లో మహిళ.. ఆమెను గుర్తు పట్టని స్కానర్! ఆమె ఏం చేసిందంటే..?

TOP 9 ET News: వెయ్యి మందితో యుద్ధం.. దద్దరిల్లే ఇంటర్వెల్‌కు నీల్ శ్రీకారం

బాబోయ్‌! మినీ బస్సు సైజులో మొసలిని చూశారా

ఒక్క ఫోటోతో.. సోషల్ మీడియాను ఫిదా చేసిన రష్మిక