డమ్మీ బాంబు అని భావించిన దంపతులకు షాక్‌ !!

బ్రిటన్‌లో ఏకంగా ఓ బాంబునే తమ ఇంటి పెరట్లో పెట్టుకున్నారు ఆ వృద్ధ దంపతులు. తీరా.. అది యాక్టివ్ బాంబ్‌ అని తెలియడంతో షాక్‌ తిన్నారు! పెమ్‌బ్రూక్‌షైర్‌కు చెందిన సియాన్‌, జెఫ్రీ ఎడ్వర్డ్స్‌ దంపతుల ఇంటి పెరట్లో చాలా కాలంగా ఓ బాంబు షెల్‌ ఉంది. అయితే.. ఆ దంపతులు దాన్ని డమ్మీ బాంబుగా భావించి లైట్‌గా తీసుకునేవారు. తోటపని తర్వాత మట్టి అంటుకున్న పనిముట్లను దానికే కొడుతూ శుభ్రపరిచేవారు. ఈ క్రమంలోనే స్థానిక పోలీసులు ఇటీవల ఆ బాంబును గుర్తించారు.

డమ్మీ బాంబు అని భావించిన దంపతులకు షాక్‌ !!

|

Updated on: Dec 08, 2023 | 7:18 PM

బ్రిటన్‌లో ఏకంగా ఓ బాంబునే తమ ఇంటి పెరట్లో పెట్టుకున్నారు ఆ వృద్ధ దంపతులు. తీరా.. అది యాక్టివ్ బాంబ్‌ అని తెలియడంతో షాక్‌ తిన్నారు! పెమ్‌బ్రూక్‌షైర్‌కు చెందిన సియాన్‌, జెఫ్రీ ఎడ్వర్డ్స్‌ దంపతుల ఇంటి పెరట్లో చాలా కాలంగా ఓ బాంబు షెల్‌ ఉంది. అయితే.. ఆ దంపతులు దాన్ని డమ్మీ బాంబుగా భావించి లైట్‌గా తీసుకునేవారు. తోటపని తర్వాత మట్టి అంటుకున్న పనిముట్లను దానికే కొడుతూ శుభ్రపరిచేవారు. ఈ క్రమంలోనే స్థానిక పోలీసులు ఇటీవల ఆ బాంబును గుర్తించారు. వెంటనే రక్షణశాఖకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన బాంబ్‌ స్క్వాడ్‌ బృందం.. ఆ వస్తువును జాగ్రత్తగా అక్కడి నుంచి దూరంగా తరలించింది. ఓ ప్రదేశంలో ఐదు టన్నుల ఇసుకతో పూడ్చిపెట్టి, సురక్షితంగా పేల్చేసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బాంబును 19 శతాబ్దం చివరినాటిదిగా భావిస్తున్నారు. బ్రిటన్‌ ‘రాయల్‌ నేవీ’ ఈ ప్రాంతంలో యుద్ధ అభ్యాసాలు చేసేదని తేలింది. అది యాక్టివ్‌గా ఉన్న బాంబు అని తెలియడంతో తామంతా ఆందోళనకు గురయ్యామని ఆ రాత్రి కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎడ్వర్డ్స్‌ ఓ వార్తాసంస్థకు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు సినిమా విలన్‌ అరెస్ట్‌ !! పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం

అవి కృత్రిమ నవ్వులు !! బందీలకు మత్తుమందు ఇచ్చిన హమాస్‌

ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న పాక్‌ అమ్మాయి భారత్‌ అబ్బాయి !! కొవిడ్‌ కష్టాలు దాటి ఒక్కటవుతున్న వేళ

బైజూస్‌లో జీతాల చెల్లింపునకు ఆయన ఇల్లు తాకట్టు

Follow us