బైజూస్‌లో జీతాల చెల్లింపునకు ఆయన ఇల్లు తాకట్టు
ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ కు ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. సంస్థను ఓ గాడిన పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా.. ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఉద్యోగులకు వేతనాలు సైతం చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయని అని నివేదికలు చెబుతున్నాయి. నలువైపుల నుంచి కష్టాలు వచ్చిపడుతున్న క్రమంలో ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు.. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ తన సొంత ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకున్నారని సమాచారం.
ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ కు ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. సంస్థను ఓ గాడిన పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా.. ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఉద్యోగులకు వేతనాలు సైతం చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయని అని నివేదికలు చెబుతున్నాయి. నలువైపుల నుంచి కష్టాలు వచ్చిపడుతున్న క్రమంలో ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు.. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ తన సొంత ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకున్నారని సమాచారం. అంతే కాదు.. తన కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం తాకట్టు పెట్టారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ ఓ కథనం వెల్లడించింది. కంపెనీని ఒడిదొడుకుల నుంచి గట్టెక్కించేందుకు బైజూస్ రవీంద్రన్ అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారని, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బైజూస్ రవీంద్రన్ తనకు బెంగళూరులో ఉన్న రెండు ఇళ్లతో పాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఓ విల్లాను సైతం తనఖా పెట్టారని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. తన సొంత ఆస్తులను తనఖా పెట్టడం ద్వారా సుమారు 12 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చారని వీటితో మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ ఉద్యోగులకు ఆయన వేతనాలను చెల్లించారని పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటితో హమాస్ సొరంగాలను నింపనున్న ఇజ్రాయెల్ !! ఎందుకంటే ??
హమాస్ కర్కశత్వానికి సాక్ష్యం .. కిడ్నాప్ వీడియో రిలీజ్
TOP 9 ET News: బలగం వేణుకి బంపర్ ఆఫర్ | వావ్ సెన్సేషనల్! 500 కోట్ల దిశగా.. యానిమల్
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

