అమెరికాలో మిత్రుడి హత్య.. కేంద్రం సాయం అర్థించిన భారతీయ నటి

|

Mar 04, 2024 | 4:38 PM

అమెరికాలో భారతీయులపై వరుస దాడుల కలకలం కొనసాగుతోంది. షికాగోలో తాజాగా జరిగిన కాల్పుల్లో మరో భారతీయుడు అమర్‌నాథ్‌ ఘోష్ మృతి చెందారు. ఘటనకు సంబంధించి మృతుడి స్నేహితురాలు, ప్రముఖ టీవీ నటి దేవొలీనా భట్టాచార్జీ కేంద్ర ప్రభుత్వం సాయం కోరింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. సెయింట్ లూయీ అకాడమీ ప్రాంతంలో సాయంత్రం వేళ వాకింగ్ చేస్తున్న తన స్నేహితుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని దేవోలీనా తెలిపింది.

అమెరికాలో భారతీయులపై వరుస దాడుల కలకలం కొనసాగుతోంది. షికాగోలో తాజాగా జరిగిన కాల్పుల్లో మరో భారతీయుడు అమర్‌నాథ్‌ ఘోష్ మృతి చెందారు. ఘటనకు సంబంధించి మృతుడి స్నేహితురాలు, ప్రముఖ టీవీ నటి దేవొలీనా భట్టాచార్జీ కేంద్ర ప్రభుత్వం సాయం కోరింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. సెయింట్ లూయీ అకాడమీ ప్రాంతంలో సాయంత్రం వేళ వాకింగ్ చేస్తున్న తన స్నేహితుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని దేవోలీనా తెలిపింది. అతడిది కోల్‌కతా అనీ తన తల్లిదండ్రులకు అతడు ఒక్కడే సంతానమనీ తల్లి మూడేళ్ల క్రితం మరణించగా తండ్రి చిన్నతనంలోనే పోయారనీ ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఈ కేసులో నిందితుల వివరాలు ఇప్పటివరకూ వెల్లడించలేదనీ అమర్‌నాథ్ ఘోష్ కోసం న్యాయపోరాటం చేసేందుకు అతడి మిత్రులు తప్ప కుటుంబసభ్యులు ఎవరూ లేరనీ అతడు గొప్ప డ్యాన్సర్, పీహెచ్‌డీ చేస్తున్నాడనీ తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు

కాకుల మాస్టర్ ఉద్యోగంలో తాజాగా నియమితులైన మాజీ సైనికుడు

సూర్యఘర్‌కు దరఖాస్తు ఎలా ?? రూ.78 వేల రాయితీ ఎలా పొందాలి ??

ఎట్టకేలకు ఓటీటీలోకి ‘షీనా బొరా’ హత్య కేసు డాక్యుమెంటరీ

రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు

 

Follow us on