అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వం ఇక లేనట్టే!

Updated on: Jan 22, 2025 | 6:03 PM

అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ ముందు చెప్పినట్టుగానే జన్మతః వచ్చే పౌరసత్వంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పిల్లలు జన్మిస్తే.. వారికి జన్మతః లభించే పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు.

అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే, ట్రంప్ మాత్రం తమ దేశంలో మాత్రమే ఇలాంటి చట్టం అమల్లో ఉన్నట్టు తప్పుగా పేర్కొన్నారు. అమెరికాలో 1868 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్దుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి కూడా జన్మతః పౌరసత్వం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో జన్మతః పౌరసత్వం ఇక లేనట్టే. అయితే, ట్రంప్ నిర్ణయం తీసుకున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యాయామం చేసిన తర్వాత ఇవి అసలు తినకూడదు

స్పామ్ కాల్స్ ఆటకట్టు, సంచార్ సాథీ యాప్ తెచ్చిన కేంద్రం

ట్రంప్ ర్యాపిడ్‌ ఫైర్‌.. వరుస ఆదేశాలు..

ఆర్జీకర్‌ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..! ఆమె ఎవరు?

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. అన్నప్రసాదంలో ఇకపై కొత్త ఐటమ్