ప్రభుత్వ ఉద్యోగులకు 400% శాలరీ హైక్..

|

Jan 10, 2025 | 11:34 AM

సిరియా ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ అబ్జాద్ ప్రకటించాడు. తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించడంతో దేశ అధ్యక్షుడు బషర్‌అల్‌అసద్‌ రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే.

అనంతరం అక్కడ నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యింది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్‌ అబ్జాద్‌ ప్రకటించారు. 1.65 ట్రిలియన్‌ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలుచేస్తామని అబ్జాద్‌ అన్నారు. కొన్నేళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల సిరియా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని అబ్జాద్‌ పేర్కొన్నారు. అయితే తమ నూతన ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తామని అరబ్‌ దేశాలు హామీ ఇచ్చాయని తెలిపారు. సిరియాకు చెందిన విదేశాల్లోని 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను విడిపించుకొనే దిశగానూ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

Yash: ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

Game Changer: చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీళ్లిద్దరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ