ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..

ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..

Phani CH

|

Updated on: Apr 24, 2024 | 5:53 PM

శ్రీలంకలో ప్రశాంతంగా కారు రేస్‌ జరుగుతోంది. ఎలాంటి ఫీజు లేకుండా ఈ రేస్‌ను తిలకించే అవకాశం కల్పించడంతో ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్లు రయ్‌రయ్‌ మంటూ దూసుకుపోతున్నాయి. ప్రేక్షకులు వాటిని చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ రేస్‌ కారు అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది. అంతే అప్పటిదాకా ప్రేక్షకుల కేరింతలతో ఉర్రూతలూగిన రేస్‌ ప్రాంగణంలో ఒక్కసారిగా హాహాకారాలు వినిపించాయి.

శ్రీలంకలో ప్రశాంతంగా కారు రేస్‌ జరుగుతోంది. ఎలాంటి ఫీజు లేకుండా ఈ రేస్‌ను తిలకించే అవకాశం కల్పించడంతో ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్లు రయ్‌రయ్‌ మంటూ దూసుకుపోతున్నాయి. ప్రేక్షకులు వాటిని చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ రేస్‌ కారు అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది. అంతే అప్పటిదాకా ప్రేక్షకుల కేరింతలతో ఉర్రూతలూగిన రేస్‌ ప్రాంగణంలో ఒక్కసారిగా హాహాకారాలు వినిపించాయి. అతి వేగంగా వచ్చిన కారు ప్రేక్షకులపైకి వెళ్లడంతో క్షణాల్లో అక్కడికక్కడే 27 మంది గాయపడ్డారు. రేస్‌ నిర్వాహకులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరో 20 మంది చికిత్స తీసుకుంటున్నారు. వారిలో కూడా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాక్స్‌ హిల్‌ సర్క్యూట్‌లో కారు రేస్‌ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు

చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు

పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??

ప్రభాస్‌ రూ. 35 లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి

రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ .. టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే