food wastage: ఆ దేశంలో పెరిగిపోతున్న ఫుడ్ వేస్టేజ్.. శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ..

|

Jun 15, 2022 | 8:38 AM

జపాన్‌కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఫుడ్ వేస్టేజ్‌తో సిమెంట్‌ను తయారు చేయవచ్చని అంటున్నారు. అంతేకాదు ఈ సిమెంట్ .. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సిమెంట్ కంటే బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు..


జపాన్‌కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఫుడ్ వేస్టేజ్‌తో సిమెంట్‌ను తయారు చేయవచ్చని అంటున్నారు. అంతేకాదు ఈ సిమెంట్ .. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సిమెంట్ కంటే బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఈ సిమెంట్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. భవిష్యత్తులో ఏ నిర్మాణాలకు సిమెంట్‌తో పని ఉండదన్నారు. అంతేకాదు ఈ సిమెంట్ లో పర్యావరణానికి హానికలిగించే ఎటువంటి హానికరమైన రసాయనాలు లేవని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రపంచం అంతా జపాన్ వైపు చూస్తోంది. జపాన్‌ దేశంలో ఆహార వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని.. అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశంలో ఫుడ్ వెస్టీజ్ సమస్య నివారణ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2030 నాటికి 2.7 మిలియన్ టన్నులను తగ్గించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.దీంతో టోక్యో యూనివర్శిటీకి చెందిన శాస్త్రజ్ఞులు సరికొత్త ఆవిష్కరణ దిశగా పరిశోధనలు ప్రారంభించి.. ఆహార వ్యర్థాలతో సిమెంట్‌ను తయారు చేస్తున్నారు. టీ ఆకులు, నారింజ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, కాఫీ గ్రౌండ్‌లు, చైనీస్ క్యాబేజీ లతో పాటు తినగా మిగిలిపోయిన ఆహార పదార్ధాలను తమ పరిశోధనకు మెటీరియల్స్ గా ఎంచుకున్నారు. ఇప్పుడు వీటిని ఉపయోగించి సిమెంట్‌ను తయారు చేశారు. ప్రపంచంలోనే మొదటిసారి ఇలా ఫుడ్ వేస్టేజ్ ట్ సిమెంట్ తయారు చేసి రికార్డ్ సృష్టించారు. ఈ సిమెంట్ ఎటువంటి నిర్మాణాలైనా చేసుకోవచ్చని.. నార్మల్ సిమెంట్ కంటే.. నాణ్యతతో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సిమెంట్ ఆహార పదార్ధాలతో తయారు చేస్తున్నారు కనుక.. ఎలుకలు, పురుగులు వంటి వాటితో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది.. కనుక.. సిమెంట్ పై రక్షణగా ఓ గమ్ పూయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సిమెంట్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా చర్యలు మొదలు పెట్టారు. ఈ సిమెంట్‌ అందుబాటులోకి వస్తే.. గ్లోబల్ వార్మింగ్‌ తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 15, 2022 08:38 AM