ఆ చేపల కోసం.. రంగంలోకి యుద్ధనౌకలు
ఆ చేపల సంతానోత్పత్తి సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోంది. యుద్ధనౌకలు, హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా పెడుతోంది. హిల్సా చేపలు పెరిగే దేశాల్లో బంగ్లాదేశ్‌దే అగ్రస్థానం. బంగాళాఖాతంలోని హెర్రింగ్ జాతికి దగ్గరగా ఉండే ఈ చేప..నదుల్లోనూ పెరుగుతుంది. దీనిని మనం పులస అంటాం.
బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి అవుతున్న చేపల్లో హిల్సా వాటా అధికం. ఈ చేప 2017లో జియోగ్రాఫికల్ ఇండికేటర్-జీఐ గుర్తింపును కూడా పొందింది. ఈ చేపను డార్లింగ్ ఆఫ్ వాటర్స్, ప్రిన్స్ ఎమాంగ్ ఫిష్‌గా బెంగాలీయులు చెబుతుంటారు. బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా అక్టోబర్ లో హిల్సా సంతానోత్పత్తి సమయంలో ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. ఆ సమయంలో చేపల సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో ఈ చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. 2012 నుంచి హిల్సా చేపల ఎగుమతుల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ.. దేవీ నవరాత్రుల సమయంలో కొన్ని రోజులు మాత్రం ఈ ఆంక్షలు సడలిస్తూ భారత్‌కు పరిమితంగా చేపలను ఎగుమతి చేస్తుంది. ఈ ఏడాది దసరా సమయంలో 1200 టన్నుల హిల్సా చేపలను భారత్‌కు ఎగుమతి చేసింది. హిల్సా చేపకు భారత్‌లో కూడా భారీ డిమాండ్ ఉంది. కోల్‌కతా మార్కెట్‌లో కిలో హిల్సా ధర దాదాపు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు పలికింది. హిల్సా చేపల వేటపై అక్టోబర్ 4 నుంచి 25 వరకు మూడు వారాల పాటు నిషేధాన్ని విధించింది బంగ్లా ప్రభుత్వం. పోస్టర్లు, కరపత్రాలు, మార్కెట్లలో లౌడ్‌స్పీకర్లతో ప్రచారం చేశారు. స్థానిక పోలీసులు సహా నేవీ, కోస్ట్‌గార్డ్, వైమానిక దళాలు భారీ ఆపరేషన్ ను ప్రారంభించాయి. తీర ప్రాంతాల్లో 17 యుద్ధనౌకలు, పెట్రోలింగ్ హెలికాప్టర్లను మోహరించాయి. నదులు, ప్రాదేశిక సముద్ర జలాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టాయి. సముద్రంలోకి స్థానిక, విదేశీ మత్స్యకారులు చొరబడకుండా చూసింది. ఆంక్షలు ఉల్లంఘించిన 100 మందిని అరెస్టు చేసింది. పటువాఖాలీలో దాదాపు 80 వేల మంది మత్స్యకారులకు నిషేధిత కాలంలో 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాధితులకు వైద్యసేవల కోసం డాక్టర్ సాహసం.. నెటిజన్ల ప్రశంసలు
కోనసీమలో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు సజీవ దహనం
PM Kisan Money: పీఎం కిసాన్ 21వ విడత… మీరు అర్హులా కాదా? ఇలా చెక్ చేసుకోండి
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

