AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివాలా తీశాడ‌ని భార్య వ‌దిలేసింది.. క‌ట్ చేస్తే

దివాలా తీశాడ‌ని భార్య వ‌దిలేసింది.. క‌ట్ చేస్తే

Phani CH
|

Updated on: Oct 09, 2025 | 8:35 PM

Share

మ‌నిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. హీరో అనుకున్న వారు జీరో కావొచ్చు. ఇలాంటి వారిలో మ‌ళ్లీ పైకి లేచేవారూ ఉంటారు. అలాంటి ఓ వ్యాపార‌వేత్త గురించి మ‌నం తెలుసుకుందాం. అయితే ఆయ‌న మ‌న‌దేశానికి చెందిన వాడు కాదు. చైనాకు చెందిన‌ 57 ఏళ్ల టాంగ్ జియాన్‌ 25 ఏళ్ల క్రితం నెలకు ₹3.7 కోట్ల రూపాయలు సంపాదించేవాడు.

తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో అతనికి మూడు రెస్టారెంట్లు, బార్లు ఉండేవి. జీవితంగా సాఫీగా సాగుతుంద‌నుకుంటున్న త‌రుణంలో ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. తెలియ‌ని వ్యాపారంలో పెట్టుబ‌డులు పెట్టి టాంగ్ జియాన్ చేతులు కాల్చుకున్నాడు. ఇతరుల‌ నుంచి అప్పులు తీసుకుని మ‌రీ పెట్టుబ‌డులు పెట్టి భారీగా న‌ష్ట‌పోయాడు. ఫ‌లితంగా అప్పుల‌తో దివాళా తీశాడు. వ్యాపారంలో స‌ర్వం కోల్పోవ‌డంతో అత‌డి జీవితం త‌ల‌కిందులైంది. రెస్ట‌ారెంట్ల‌ను మూసివేశాడు. ఆస్తులు మొత్తం అమ్మినా అప్పులు తీర‌లేదు. భార్య‌తో త‌ర‌చుగా గొడ‌వ ప‌డేవాడు. దీంతో భార్య అత‌డిని వ‌దిలి వెళ్లిపోయింది. ఎందుకు బ‌త‌కాల‌న్న ఆలోచన‌లు వెంటాడేవి. అయితే త‌న‌పై ఆధార‌ప‌డిన అమ్మ‌, క‌న్న‌బిడ్డ గుర్తుకు రావ‌డంతో ఎలాగైనా జీవితాన్ని ఈదాల‌ని అనుకున్నాడు. 2018లో కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాడు. పాత రెస్టారెంట్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేశాడు. ఇంట్లో తయారుచేసిన సాసేజ్‌ల‌ను అక్క‌డ అమ్మ‌డం ప్రారంభించాడు. 74 ఏళ్ల తల్లి అతడికి సహాయం చేసేది. నాణ్యమైన మాంసాన్ని కొనుగోలు చేసి వాటికి సంబంధించిన బిల్లులను దుకాణంలో ప్రదర్శించాడు. వాటిని చూసిన కస్టమర్లకు అతనిపై క్రమంగా నమ్మకం పెరిగింది. ఒక‌ప్పుడు బాగా బ‌తికిన టాంగ్ జియాన్ చివ‌రికి వీధి దుకాణం పెట్టుకోవాల్సి రావ‌డంతో ఆత్మన్యూన‌త‌కు గుర‌య్యాడు. త‌నను గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధ‌రించేవాడు. అయితే పొరుగున ఉండే వారిలో ఒక‌రు అత‌డిని గుర్తు ప‌ట్ట‌డంతో ముఖం దాచుకోవ‌డం మానేశాడు. ధైర్యంగా త‌న వ్యాపారంపై దృష్టి పెట్టాడు. క‌ష్టాన్ని న‌మ్ముకుని ముందుకు సాగాడు. అత‌డి వ్యాపారం దిన‌దినాభివృద్ధి సాధించింది. రోజుకు 2 టన్నుల సాసేజ్‌లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు టాంగ్ జియాన్ రోజుకు దాదాపు ₹25 లక్షలు సంపాదిస్తున్నాడు. ప‌లు షాపింగ్ సెంటర్లలో అత‌డి అవుట్‌లెట్‌లు ఉన్నాయి. సంక‌ల్పం గ‌ట్టిగా ఉంటే శిఖ‌ర‌స్థాయి నుంచి కింద‌కు ప‌డిపోయినా మ‌ళ్లీ పైకి లేవచ్చ‌ని టాంగ్ జియాన్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. టాంగ్ జియాన్ ప్ర‌స్థానాన్ని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్ర‌చురించింది. దీన్ని చ‌దివిన పాఠ‌కులు అత‌డిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఉన్న‌త స్థానం నుంచి కింద‌కు ప‌డిపోయినా ప‌ట్టుద‌ల‌తో పోరాడిన టాంగ్ జీవితం స్ఫూర్తిదాయ‌క‌మ‌న్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా భార్య పాము.. రాత్రి కాగానే కాటేస్తోంది

ఇక.. ఈపీఎఫ్ కనీస పింఛన్ రూ. 2500.. ఆ రోజే నిర్ణయం

Today Gold Price: బంగారం ధరలు ఆగేదెప్పుడు ?? తులం ఎంతంటే ??

Thalapathy Vijay: ఓదార్పు యాత్ర చేయాలి.. పర్మిషన్ ప్లీజ్

గ్యాస్‌ సిలిండ‌ర్ల లారీని ఢీకొన్న పాల ట్యాంక‌ర్‌.. తర్వాత