Titan: నాన్న సంతోషం కోసం వెళ్లాడు.. నాన్నతో పాటే పోయాడు.! కుబేరుల ప్రాణాలను తీసుకుంటున్న టైటానిక్ నౌక..
అత్యంత సంపన్నుల కోసం నిర్మించిన టైటానిక్ నౌక... ఇంకా కుబేరుల ప్రాణాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఆ ఓడ శకలాలను చూసేందుకు వెళ్లి చనిపోయినవారిలో ఐదుగురూ ధనవంతులే. అప్పట్లో టైటానిక్ ఓడ ప్రమాద సమయంలో మహిళలు, చిన్నారులను లైఫ్‌బోట్ సాయంతో రక్షిస్తుండగా..
అత్యంత సంపన్నుల కోసం నిర్మించిన టైటానిక్ నౌక… ఇంకా కుబేరుల ప్రాణాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఆ ఓడ శకలాలను చూసేందుకు వెళ్లి చనిపోయినవారిలో ఐదుగురూ ధనవంతులే. అప్పట్లో టైటానిక్ ఓడ ప్రమాద సమయంలో మహిళలు, చిన్నారులను లైఫ్‌బోట్ సాయంతో రక్షిస్తుండగా.. ఇడా స్ట్రాస్ అనే వివాహితకూ బయటపడే అవకాశం లభించింది. అయితే భర్త వెంట రాకుండా తాను రాలేనని అక్కడే ఉండిపోయారు. భర్తతోపాటు ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ జంట వారసురాలే వెండీ రష్. స్ట్రాస్ దంపతుల కుమార్తెల్లో ఒకరైన మిన్నీకి ఆమె మునిమనవరాలు. ఓషన్‌గేట్ యాత్ర ద్వారా ఆమె కూడా గతంలో టైటానిక్ శకలాలను వీక్షించారు.
తాజాగా టైటాన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన స్టాక్టన్ రష్.. ఈమె భర్త నీటిలో ఒక దశ దాటి లోతుకు వెళ్లే కొద్దీ పీడనం తీవ్రంగా పెరిగిపోతుంది. ఆ పరిస్థితుల్లో మినీ జలాంతర్గామి ఆకృతిలో చిన్న లోపం కూడా భారీ విపత్తుకు దారి తీస్తుంది. టైటాన్ ప్రమాదానికి గురైన ప్రదేశంలో నీటి పీడనం.. భూమిపై ఉన్న దాని కంటే 350 రెట్లు అధికంగా ఉంది. టైటానిక్ ఓడ శకలాలున్న ప్రదేశాన్ని సముద్రంలో మిడ్‌నైట్ జోన్‌గా వ్యవహరిస్తారు. 3,300 అడుగుల నుంచి 13,100 అడుగుల లోతు వరకు ఉండే ప్రదేశాలను ఇలా అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. మినీ జలాంతర్గామిలో ఉన్నవారికి ఏం జరుగుతోందో తెలిసేలోపే అది విచ్ఛిన్నమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అట్లాంటిక్ మహా సముద్రంలో విచ్ఛిన్నమైన టైటాన్ మినీ జలాంతర్గామిలో పాకిస్థానీ బిలియనీర్ షెహ్‌జాదా దావూద్ తో పాటు ఆయన కుమారుడు సులేమాన్ కూడా ఉన్నారు. నిజానికి సులేమాన్‌కు అసలు ఇటువంటి సాహస యాత్రలంటే భయం. తండ్రి కోరిక మేరకే ఈ టైటాన్‌లో వెళ్లి సముద్రగర్భంలో చనిపోయినట్లు అతడి సమీప బంధువులు వెల్లడించారు. ‘ఫాదర్స్ డే’ రోజున నాన్నను సంతోషపెట్టాలని భావించి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..