Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిత్యానంద ఉండేది అక్కడే వీడియో

నిత్యానంద ఉండేది అక్కడే వీడియో

Samatha J
|

Updated on: Jun 24, 2025 | 9:15 PM

Share

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన ఆస్ట్రేలియా దేశానికి సమీపంలో తాను ఏర్పాటు చేసుకున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ప్రత్యేక దేశంలో ఉంటున్నారని ఆయన శిష్యురాలు మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనానికి తెలిపారు. మధురై ఆధీన మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో జారీ అయిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధీన మఠంలోకి నిత్యానంద ప్రవేశించరాదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిత్యానంద అప్పీల్ చేసుకున్నారు.

 ఈ కేసు గురువారం మధురై ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నిత్యానంద తరపున ఆయన శిష్యురాలు అర్జన హాజరై వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆమె ఆస్ట్రేలియా సమీపంలోని కైలాస దేశంలో ప్రస్తుతం నిత్యానంద నివసిస్తున్నారని ఆమె కోర్టుకు తెలియజేశారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా నిత్యానంద అసలు ఎక్కడ ఉన్నారు? ఆయన చెబుతున్న కైలాస దేశం ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్ళాలంటే వీసా, పాస్ పోర్టు లాంటివి అవసరమా? అంటూ ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. తాజాగా శిష్యురాలు అర్జన చేసిన ప్రకటనతో నిత్యానంద ఆటంకీపై కొంత స్పష్టత వచ్చినట్లయింది. అనంతరం నిత్యానంద తరపున కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అర్జన ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ పరిణామంతో నిత్యానంద ఆయన కైలాస దేశం మరోసారి వార్తల్లో నిలిచాయి.

మరిన్ని వీడియోల కోసం :

జ్యుయలరీ షాపునకు వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడు..అతను అడిగింది విని యజమాని ఫిదా వీడియో

చిరుతకే ఝలక్‌ ఇచ్చిన గ్రామ సింహం..ఎలా తప్పించుకుందంటే వీడియో

వద్దు నాన్నా.. భయమేస్తోంది వీడియో