Gaza: దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రతరం.. పాలస్తీనా ప్రధానికి జైశంకర్‌ ఫోన్.!

|

Dec 13, 2023 | 3:30 PM

ఇజ్రాయెల్‌, హమాస్‌ కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకున్న తర్వాత గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తీవ్రతరం చేశాయి. హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో గాజాలో మానవతా సాయంపై అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆదివారం ఉదయం దక్షిణ గాజాలోని ఖాన్‌ యునిస్‌ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లో

ఇజ్రాయెల్‌, హమాస్‌ కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకున్న తర్వాత గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తీవ్రతరం చేశాయి. హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో గాజాలో మానవతా సాయంపై అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆదివారం ఉదయం దక్షిణ గాజాలోని ఖాన్‌ యునిస్‌ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేసినట్లు హమాస్‌ తెలిపింది. మరోవైపు హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు.

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రతరం కావడంతో ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. మానవతా సాయం అందక ఎంతో మంది సామాన్య పౌరులు ఆకలి, వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి వరకు 17,700 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారని హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 40 శాతం మంది 18 ఏళ్లలోపు పిల్లలే ఉంటారని తెలిపింది. మరోవైపు, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ శనివారం రాత్రి పాలస్తీనా ప్రధాని మహమ్మద్‌ ష్టయ్యేహ్‌ (Mohammad Shtayyeh)కి పోన్‌ చేశానని, గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పాలస్తీనాపై భారత్‌ దీర్ఘకాలిక వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశానని జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.