Israel War: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం తీవ్రరూపం. 7 వేలకు పైగా మిలిటెంట్లు హతం!

Israel War: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం తీవ్రరూపం. 7 వేలకు పైగా మిలిటెంట్లు హతం!

Anil kumar poka

|

Updated on: Dec 13, 2023 | 7:25 PM

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది..ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజ వణికిపోతోంది..ఖాన్‌ యూనిస్‌ నగరం బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఇప్పటివరకు 7 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లను హతమార్చింది ఇజ్రాయెల్‌.. గాజా నగరం శవాలదిబ్బగా మారిపోతోంది..గాజాలో ఇప్పటివరకు 17వేల మందికి పైగా మరణించారు. అదే సమయంలో 46 వేల మందికి పైగా గాయపడ్డారు.!

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది..ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజ వణికిపోతోంది..ఖాన్‌ యూనిస్‌ నగరం బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఇప్పటివరకు 7 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లను హతమార్చింది ఇజ్రాయెల్‌.! గాజా నగరం శవాలదిబ్బగా మారిపోతోంది..గాజాలో ఇప్పటివరకు 17వేల మందికి పైగా మరణించారు. అదే సమయంలో 46 వేల మందికి పైగా గాయపడ్డారు.. గాజాలో ఆహారం, నీరు, నిత్యావసరాల కొరత తీవ్రంగా ఉంది. మానవతా సాయం అందక గాజా జనాభాలో 90 శాతం మంది ప్రతిరోజు తిండి తినలేకపోతున్నారు.హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం మరింత ప్రమాదకరంగా దాడులు చేయడం మొదలు పెట్టింది. 23 లక్షల గాజా జనాభాలో దాదాపు 85 శాతం మంది బతుకుజీవుడా అంటూ స్వస్థలాలను వదిలిపోయినా సరే ఇజ్రాయెల్‌ దాడులు తగ్గించడం లేదు..దాదాపు 834 కోట్ల విలువైన యుద్ధ ట్యాంక్‌ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్‌ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు..గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.