పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు డొనాల్డ్ ట్రంప్‌ను దోషిగా తేల్చటం.. అమెరికాలో చర్చనీయాంశం అయింది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువైనట్లు కోర్టు వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని సగం మంది అమెరికన్లు అభిప్రాయపడినట్లు ఓ సర్వేలో తెలిసింది. హష్ మనీ కేసులో ట్రంప్‌ను కోర్టు దోషిగా ప్రకటించటం సరైందేనని ABC News IPSOS poll సర్వేలో 50 శాతం అమెరికన్లు అభిప్రాయపడ్డారు. 23 శాతం మంది మాత్రం సరైందా? కాదా? అనే విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. మరో 27 శాతం ట్రంప్‌ను దోషిగా తెల్చటాన్ని తప్పుపడుతున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితంగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న అమెరికన్లు స్పష్టం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్ హీరో అంటూ ప్రశంసలు
అరుణాచల్‌లో అరుదైన చీమలు.. సియాంగ్ లోయలో గుర్తింపు
ఏందన్నా ఇదీ !! నీకు పెళ్లి చేసుకోడానికి పిల్లే దొరకలేదా
చెట్టును రోడ్డుకి అడ్డంగా పడగొట్టి ఏనుగు నిరసన.. నెట్టింట వీడియో వైరల్
గోడ దూకి ఇంటి ఆవరణలోకి చిరుత.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యం చూసి అంతా షాక్