మోనాలిసా కొలువైన మ్యూజియంలో.. మహా దోపిడీ
ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో సినీఫక్కీలో భారీ చోరీ జరిగింది. కేవలం 7 నిమిషాల్లోనే దొంగలు తమ పని కానిచ్చేశారు! ఈ క్రమంలో దొంగలు.. అక్కడ భద్రపరచిన అత్యంత విలువైన పురాతన నగలు కొట్టేశారు. ప్రపంచ ప్రసిద్ధ మోనాలిసా అసలైన చిత్రం ఈ మ్యూజియానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగినట్లు ఫ్రాన్స్ అంతర్గత శాఖ మంత్రి లారెంట్ నూనెజ్ తెలిపారు.
దొంగలు.. హైడ్రాలిక్ నిచ్చెన ఉపయోగించి ప్రహరీ ఎక్కి.. దాని మీది ఫెన్సింగ్‌ను డిస్క్ కట్టర్లతో కత్తెరించారు. అనంతరం వారు ఒడుపుగా.. మ్యూజియంలోకి చొరబడి.. అపోలో గ్యాలరీలోని విలువైన నగల్ని ఎత్తుకెళ్ళారు. ఈ దోపిడీ ముఠాలో.. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా.. ఆదివారం అధికారులు మ్యూజియాన్ని మూసివేసారు. మ్యూజియం భవనానికి రిపేర్లు జరుగుతున్నాయని, ఆ పనులు జరిగే ప్రాంతం నుంచే దొంగలు లోనికి చొరబడ్డారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అపోలో గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులో నుంచి తొమ్మిది వస్తువులను దొంగిలించారు. దొంగలు కాజేసిన వస్తువుల్లో.. నెపోలియన్ కాలం నాటి వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి. ఈ మ్యూజియంలో మెసపొటోమియా, ఈజిప్టుకు చెందిన అనేక వస్తువులు, వివిధ రాజ్యాల చిత్రాలు, శిల్పాలు వంటి వస్తువులు 33 వేల వరకు ఉన్నాయి. మ్యూజియాన్ని రోజూ దాదాపు 30 వేల మంది సందర్శిస్తుంటారు. లవ్రే మ్యూజియంలో గతంలో కూడా చోరీలు జరిగాయి. మోనాలిసా చిత్రాన్ని 1911లో మ్యూజియంలో పనిచేసిన మాజీ కార్మికుడు విన్సెంజో దొంగిలించాడు. రెండేళ్ల తర్వాత అతడు.. ఆ చిత్రాన్ని ఇటలీలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా విన్సెంజోను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 1913లో మోనాలిసా చిత్రం తిరిగి మ్యూజియానికి చేరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మర్యాదగా ఒప్పుకో.. లేదంటే లేపేస్తాడు జెలెన్ స్కీకి ట్రంప్ వార్నింగ్
ఆ చెట్టు ఆకుల్లో బంగారం.. నిర్ధారించిన ఫిన్‌ల్యాండ్ శాస్త్రవేత్తలు
నోరు మూయలేక ఇబ్బందిపడ్డ యువకుడు.. దేవుడిలా వచ్చి
Ram Pothineni: ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశాం.. కానీ ఆ తరువాత..
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

