మస్క్‌ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..

Updated on: Mar 01, 2025 | 2:04 PM

డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిపాలనలో స్పీడ్‌ పెంచారు. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో తగ్గేదే లే అంటున్నారు. అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఇతర దేశాల ఉత్పత్తులపై పన్నుల మీ పన్నులు దంచేస్తున్నారు. ఇక అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారికి సంకెళ్లు వేసి మరీ దేశం దాటిస్తున్నారు. అయితే ఈసారి ట్రంప్‌కు కుడి భుజంగా ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌మస్క్‌ తోడయ్యారు. కానీ ఇప్పుడు వీరిద్దరి ఓ ఫేక్ వీడియో సంచలనం సృష్టిస్తోంది.

ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు వెనుక ఎలాన్‌ మస్క్‌ కష్టపడి పని చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.అంతేకాదు.. ట్రంప్‌ ప్రచారం కోసం మస్క్‌ భారీవిరాళం కూడా ఇచ్చారు. దీంతో ట్రంప్‌ తన ప్రభుత్వంలో మస్క్‌కు చోటు కల్పించారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన మస్క్‌కు ట్రంప్‌ తన కార్యవర్గంలో కీలక పదవి కట్టబెట్టారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మస్క్‌కు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు ఎదురైనా ట్రంప్‌ లెక్కపెట్టలేదు. ఈ నేపథ్యంలోనే కొందరు ట్రంప్‌ను అవమానించేలా ఏఐ ద్వారా ఓ వీడియోని సృష్టించారు. ఎలాన్‌ మస్క్‌ పాదాలను ట్రంప్‌ ముద్దాడుతున్నట్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా వీడియోను క్రియేట్‌ చేశారు. ఆ వీడియోను ఏకంగా యూఎస్‌ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ లోని టీవీల్లో ప్రదర్శించారు. అధికారులు ఈ వీడియోని గమనించి ప్రసారం ఆపేలోపే.. అక్కడున్న కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో పెట్టేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రధాని మోదీ తీసుకునే సూపర్‌ ఫుడ్‌ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!

చివరి అమృత్‌స్నాన్‌.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!

ఫంక్షన్‌ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో

ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో