Donald Trump: ట్రంప్ నిర్ణయాల్లో ఎలన్ మస్క్ పాత్రే కీలకమా

Updated on: Jan 24, 2025 | 3:00 PM

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మిత్రుడు, అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రంప్‌ ప్రసంగంలో భాగంగా అంగారక గ్రహంపైకి అమెరికా వ్యోమగాములను పంపిస్తామనీ అమెరికా జెండాను అక్కడ పాతుతామని అన్నారు. తన సొంత మార్స్‌ గ్రహం ప్రాజెక్ట్‌కు ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే మస్క్‌ నవ్వుతూ తెగ సంబరపడ్డాడు.

ఎన్నికల ప్రచారం మొదలు.. గెలిచే వరకు ట్రంప్‌ కు మస్క్‌ వెన్నుదన్నుగా ఉన్నారు. ట్రంప్‌ గెలవడంతో కేబినెట్‌లో మస్క్‌కు కీలక పదవిని అప్పగించారు. ఇక ట్రంప్‌ ప్రసంగంలో అంగారక గ్రహం అంశం తెరపైకి రావడంతో మస్క్‌ చేపట్టనున్న ప్రయోగాలకు కొత్త ప్రభుత్వ సహాయసహకారాలు పెద్దఎత్తున ఉండే అవకాశం ఉంది. అంతరిక్ష రంగానికి సంబంధించి మస్క్‌ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. స్పేస్‌ఎక్స్‌ అధినేతగా వరుస ప్రయోగాలతో అంతరిక్ష రంగంలో దూసుకెళుతున్నారు. మరో గ్రహంపై మానవాళి జీవనం సాగించాలని మస్క్‌ బలంగా కోరుకుంటున్నారు. మస్క్‌… మార్స్‌ ప్రాజెక్ట్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. భవిష్యత్తులో అంగారక గ్రహంపై చేపట్టే ప్రయోగాల కోసం స్పేస్ఎక్స్‌ సంస్థ ‘స్టార్‌షిప్‌’ పేరుతో అతిపెద్ద రాకెట్‌ను అభివృద్ధి చేస్తోంది. గతంలో ఓ యూజర్‌ అంగారక గ్రహానికి సంబంధించి పోస్టు చేశాడు. మస్క్‌ స్పందిస్తూ ‘‘ఐదేళ్లలోపే ఆ గ్రహంపైకి మానవరహిత యాత్ర విజయవంతమవుతుందనీ 10 ఏళ్లలోపే అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతామనీ, 20 ఏళ్లలో మార్స్‌పై ఓ నగరాన్ని నిర్మిస్తామనీ కచ్చితంగా వచ్చే 30 ఏళ్లకు అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుంది అని రాసుకొచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ మొదలైన కార్చిచ్చు.. ఈ సారి ఎక్కడంటే ??

రికార్డు స్థాయిలో మంత్రాలయం హుండీ ఆదాయం

ఒక్క ఆధారం కూడా లేకుండా.. పకడ్బందీగా దారుణం

ధనుష్‌ అలా మాట్లాడేసరికి షాకయ్యా

రూ.30 కోట్ల బడ్జెట్! రూ.100 కోట్ల కలెక్షన్స్‌! ఈ హిట్ సినిమా OTTలో…

Published on: Jan 24, 2025 02:58 PM