యువకుడిని ఉరి తీసిన ఇరాన్ సర్కార్.. చేసిన తప్పేంటంటే ??

|

Dec 16, 2022 | 9:23 AM

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా..ఆ దేశ సర్కార్ ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా..ఆ దేశ సర్కార్ ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే.. 23 ఏళ్ల యువకుడు మోసిన్ షెకారీని ఉరి తీసింది ప్రభుత్వం. ఇరాన్ పత్రిక్ మిజాన్ ఈ విషయం వెల్లడించింది. టెహ్రాన్‌లోని ఓ రోడ్‌ని బ్లాక్ చేసి.. భద్రతా బలగాలపై దాడి చేశాడని, అందుకే ఉరి తీశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటి వరకూ ఈ నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు చేసినప్పటికీ.. ఇలా ఉరి తీయలేదు. అనధికారికంగా కొందరిని కాల్చి చంపారు. కానీ…ప్రభుత్వమే అధికారికంగా ఇలా ఉరి తీయడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ హెచ్చరికల్ని కాదని రోడ్లపై ఇలా నిరసనలు చేపడితే.. ఇలాంటి శిక్షే పడుతుందని తేల్చి చెప్పింది. ఈ యువకుడు సైనికుడిని చంపినట్టు ఆధారాలున్నాయని, అందుకే ఉరి తీశామని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలపై కాల్పులకు తెగబడ్డాయి భద్రతా దళాలు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళలు రహాస్యంగా చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి కొడుకుని చూసి వధువు షాక్.. అమ్మాయి ఎంచేసిందో తెలుసా ??

స్టార్ రైటర్ ఇజ్జత్ తీసేలా ట్వీట్.. దెబ్బకు దండం పెట్టిన RGV

Allu Arjun: ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్

Ravi Teja: స్టార్ హీరో కారణంగా.. భారీగా నష్టపోయిన రవితేజ !!

Shruti Haasan: దిక్కు మొక్కు లేనోళ్లకు శ్రుతి హాసనే దిక్కు !!

 

Published on: Dec 16, 2022 09:23 AM